logo

రిక్షాలో రష్యా కుటుంబం ప్రయాణం

ప్రస్తుత కాలంలో రిక్షాలు చాలా అరుదుగా కనిపిస్తున్నాయి. ఈ బండిని విదేశీ జంట సొంతంగా తయారు చేసుకుని మరీ ఉపయోగిస్తుండటం విశేషం.

Published : 04 Jul 2024 00:42 IST

కుటుంబసభ్యులతో రిక్షా వద్ద సెర్గె

ఆర్కేనగర్, న్యూస్‌టుడే: ప్రస్తుత కాలంలో రిక్షాలు చాలా అరుదుగా కనిపిస్తున్నాయి. ఈ బండిని విదేశీ జంట సొంతంగా తయారు చేసుకుని మరీ ఉపయోగిస్తుండటం విశేషం. పుదుచ్చేరిలోని అంతర్జాతీయ నగరం ఆరోవిల్లేలో నివాసం ఉంటున్న రష్యాకు చెందిన సెర్గె- తాన్య దంపతులకు ముగ్గురు పిల్లలున్నారు. సెర్గె పుదుచ్చేరిలోని ఆటోమొబైల్‌ వర్క్‌షాప్‌లో పనిచేస్తున్నారు. తాన్య చిత్రకళాకారిణి. ఆయన వర్క్‌షాప్‌కు వచ్చి వెళ్లేందుకు వీలుగా సొంతంగా రిక్షా తయారు చేసుకున్నారు. కుటుంబమంతా ఎక్కడికైనా ఇందులోనే ప్రయాణం సాగిస్తుంటారు. ఎండ, వాన తగలకుండా పైకప్పు, ఇరువైపులా తెర కూడా ఏర్పాటు చేసుకున్నారు. ఈ రిక్షా నగర ప్రాంతంలో వెళ్లేటప్పుడు పలువురిని దృష్టిని ఆకర్షిస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని