logo

వైద్య విద్యార్థినికి 12 స్వర్ణ పతకాలు

తిరునెల్వేలి ప్రభుత్వ వైద్యకళాశాల స్నాతకోత్సవంలో ఓ విద్యార్థిని 12 స్వర్ణ పతకాలు అందుకుని అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది.

Updated : 04 Jul 2024 04:35 IST

పతకాలు అందుకున్న విద్యార్థిని ఆర్తి శక్తిబాలతో తల్లిదండ్రులు

టీనగర్, న్యూస్‌టుడే: తిరునెల్వేలి ప్రభుత్వ వైద్యకళాశాల స్నాతకోత్సవంలో ఓ విద్యార్థిని 12 స్వర్ణ పతకాలు అందుకుని అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. తిరునెల్వేలి జిల్లా మహరాజా నగర్‌కు చెందిన ఆర్తి శక్తిబాల 2018వ బ్యాచ్‌లో చేరి కళాశాల నుంచి వైద్య విద్య అభ్యసిస్తున్నారు. కళాశాలలో ఉత్తమ విద్యార్థినిగా పేరు తెచ్చుకున్న ఆమె అన్ని పాఠ్యాంశాల్లో ప్రతిభ చాటేవారు. ఈ నేపథ్యంలో మంగళవారం కళాశాలలో స్నాతకోత్సవం జరుగగా రాష్ట్ర శాసనసభ స్పీకర్‌ అప్పావు పాల్గొని డిగ్రీ పట్టాలు అందజేశారు. ఆర్తి శక్తిబాల అనాటమీ ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ, ఫార్మకాలజీ, మైక్రోబయోలజీ, కమ్యూనిటీ మెడిసిన్, జనరల్‌ మెడిసిన్‌ వంటి వివిధ పాఠ్యాంశాల్లో ప్రథమ ర్యాంకు సాధించి స్వర్ణ పతకాలు కైవసం చేసుకున్నారు. అలాగే ఉత్తమ విద్యార్థిని అవార్డుతో పాటు మరికొన్ని అంశాలకు సంబంధించి పతకాలు అందుకున్నారు. ఒకే కార్యక్రమంలో ఓ విద్యార్థిని 12 అవార్డులు అందుకోవడం చూసి కార్యక్రమానికి వచ్చినవారు ఆశ్యర్యం వ్యక్తం చేశారు. ముఖ్య అతిథి అప్పావు కూడా ఆమెను అభినందించారు.


వైరల్‌గా మారిన మటన్‌ కీమా కేక్‌

కేక్‌ తయారీలో విధుసింగ్‌

వడపళని, న్యూస్‌టుడే: మదురైకి చెందిన మహిళ తయారు చేసిన ‘మటన్‌ కీమా కేక్‌’ బిజారే రిసిప్‌ వీడియోలో వైరల్‌గా మారింది. ఈ వీడియోను ఇప్పటివరకు 3 మిలియన్ల మంది వీక్షించారు. మహిళ విధుసింగ్‌ ఇన్‌స్టాగ్రామ్‌ బయోలో తానొక ‘కేక్‌ ఆర్టిస్ట్‌’, ‘పాసనేట్ బేకర్‌’ అని పరిచయం చేసుకుంటూ ‘మటన్‌ కీమా కేక్‌’ను తాజాగా వీడియోలో ప్రదర్శించింది. స్పాంజి కేక్‌పై క్రీమ్‌తో అందంగా అలంకరించి మిరప, కరివేపాకుతో తయారు చేసింది. మటన్‌ కూర చేసి, నాలుగు పొరలుగా చేసిన తర్వాత రెండింటిని మాత్రమే ట్రయల్‌గా వాడినట్లు పేర్కొంది. తర్వాత చికెన్‌తో కేక్‌ చేయాలనుకుంటున్నట్లు తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని