logo

చైనా రకం కూరగాయలు చెన్నైలో విక్రయం

నీలగిరి జిల్లాలో పండుతున్న చైనా రకానికి చెందిన కూరగాయలను రైతుల నుంచి నేరుగా కొనుగోలు చేసి చెన్నైలో తక్కువ ధరకు విక్రయించాలని సహకారశాఖ అధికారులకు ఉత్తర్వులు జారీ చేసింది.

Published : 04 Jul 2024 00:39 IST

విల్లివాక్కం, న్యూస్‌టుడే: నీలగిరి జిల్లాలో పండుతున్న చైనా రకానికి చెందిన కూరగాయలను రైతుల నుంచి నేరుగా కొనుగోలు చేసి చెన్నైలో తక్కువ ధరకు విక్రయించాలని సహకారశాఖ అధికారులకు ఉత్తర్వులు జారీ చేసింది. చెన్నైలోని ట్రిప్లికేన్‌ నగర సహకార సంఘం, కాంచీపురం జిల్లా సహకార పండగసాలై సహా నాలుగు సహకార సంఘాలు ‘హరిత ఫాం’ పేరిట కూరగాయల దుకాణాలు నిర్వహిస్తున్నాయి. నీలగిరి జిల్లాలో కోత్తగిరి, కుందా, ఊటీ, కున్నూర్‌ తదితర ప్రాంతాల్లోని రైతులు పురోగోలి, సుక్కుని, ఐస్‌బెర్గ్, వెట్యూస్, బ్రస్సల్స్, సెలరి, పార్‌సెలి తదితర చైనా రకాల కూరగాయలను, క్యాబేజి, క్యారెట్, బంగాళా దుంపలు తదితరాలను పండిస్తున్నారు. వాటిని నీలగిరి సహకార విక్రయ సంఘం కింద పని చేస్తున్న కొండ కూరగాయల కేంద్రానికి తీసుకొచ్చి వేలం ద్వారా విక్రయిస్తున్నారు. చెన్నై, శివారు ప్రాంతాల్లో చైనారకం కూరగాయలు అమ్మకాలు అధికంగా ఉంటాయి. సహకార శాఖ అధికారి ఒకరు మాట్లాడుతూ.. చైనా రకం కూరగాయలను ఫాస్ట్‌ఫుడ్, సూప్‌లలో ఉపయోగిస్తున్నట్లు పేర్కొన్నారు. నీలగిరి రైతుల నుంచి కొనుగోలు చేసి చెన్నైలోని ‘హరిత ఫాం’లలో విక్రయించడానికి చర్యలు చేపట్టినట్టు పేర్కొన్నారు. తద్వారా రైతలకు ఆదాయం అందడంతో బాటు తక్కువ ధరకు కూరగాయలు లభ్యమవుతాయని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని