logo

పారిశుద్ధ్య కార్మికులను బస్సులో ఎక్కనివ్వని కండక్టర్‌ సహా ఇద్దరి సస్పెన్షన్‌

తంజావూర్‌ ప్రభుత్వ ఆస్పత్రి పారిశుద్ధ్య కార్మికులు, నర్సులను బస్సులోకి ఎక్కించేందుకు నిరాకరించిన కండక్టర్‌ సహా ఇద్దరిని సస్పెండ్‌ చేశారు.

Published : 03 Jul 2024 00:34 IST

ఆందోళనకు దిగిన కార్మికులతో మాట్లాడుతున్న పోలీసులు

ఆర్కేనగర్, న్యూస్‌టుడే: తంజావూర్‌ ప్రభుత్వ ఆస్పత్రి పారిశుద్ధ్య కార్మికులు, నర్సులను బస్సులోకి ఎక్కించేందుకు నిరాకరించిన కండక్టర్‌ సహా ఇద్దరిని సస్పెండ్‌ చేశారు. నర్సులు, పారిశుద్ధ్య కార్మికులు పెద్దసంఖ్యలో మంగళవారం ఉదయం పాతబస్టాండ్‌కు వచ్చారు. అక్కడి నుంచి ఆస్పత్రికి వెళ్లేందుకు ప్రభుత్వ బస్సు ఎక్కారు. బస్సు ఆలస్యంగా బయల్దేరుతుందని అందరూ దిగి వెళ్లిపోవాలని కండక్టర్‌ యేసుదాస్‌ చెప్పాడు. నర్సులు, పారిశుద్ధ్య కార్మికులు బస్టాండ్‌ వద్ద ఆందోళనకు దిగారు. సమయానికి విధులకు వెళ్లలేకపోతున్నామని ఆరోపించారు. సమాచారం మేరకు అక్కడికొచ్చిన పోలీసులు అంబులెన్స్‌లో అందరినీ ఆస్పత్రికి పంపారు. ఈ వ్యవహారంపై రవాణశాఖ అధికారులు విచారణ జరిపారు. టైమ్‌ కీపర్‌ రాజా, కండక్టర్‌ యేసుదాస్‌ను సస్పెండ్‌ చేస్తూ శాఖాపరంగా చర్యలు తీసుకున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని