logo

ఎస్సైగా చెప్పుకొంటూ చోరీలకు పాల్పడుతున్న యువతి

తూత్తుక్కుడి జిల్లా రాజపాళెయానికి చెందిన గంగాదేవి ప్లస్‌టూ వరకు చదివింది. ఈమె తాను సబ్‌ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్నట్లు ఐడీకార్డు సృష్టించింది.

Published : 03 Jul 2024 00:30 IST

 గంగాదేవి

ప్యారిస్, న్యూస్‌టుడే: తూత్తుక్కుడి జిల్లా రాజపాళెయానికి చెందిన గంగాదేవి ప్లస్‌టూ వరకు చదివింది. ఈమె తాను సబ్‌ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్నట్లు ఐడీకార్డు సృష్టించింది. ఈ నేపథ్యంలో కొన్ని రోజుల క్రితం కామరాజర్‌ నగర్‌లో ఉన్న తన స్నేహితురాలి ఇంటికి వెళ్లింది. అక్కడ స్నేహితురాలి తల్లితో.. తాను చెన్నైలో ఎస్సైనని, ఎన్‌కౌంటర్‌ విషయమై తూత్తుక్కుడికి వచ్చానని, రెండు రోజులు వారి ఇంట్లో ఉండేందుకు అనుమతి ఇవ్వాలని కోరింది. దీంతో ఇంట్లో ఉండేందుకు ఆమె అనుమతి ఇచ్చింది. ఈ క్రమంలో గంగాదేవి ఇంట్లో ఉన్న బంగారు నగలు, నగదు చోరీచేసి పారిపోయింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేపట్టి శుక్రవారం మరో స్నేహితురాలి ఇంట్లో ఈ విధంగానే నగదు చోరీ చేసినట్లు గుర్తించారు. సోమవారం గంగాదేవిని అరెస్టు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని