logo

ఆస్పత్రిలో లంచం అడిగారనడం అవాస్తవం

సైదాపేటలో అతిసారం బారినపడి ఓ బాలుడు మృతి చెందగా, అతని సోదరిని అనారోగ్యంతో ఎగ్మూర్‌ పిల్లల ఆస్పత్రిలో చేర్చారు.

Published : 01 Jul 2024 00:51 IST

మంత్రి మా.సుబ్రమణియన్‌

ఆర్కేనగర్, న్యూస్‌టుడే: సైదాపేటలో అతిసారం బారినపడి ఓ బాలుడు మృతి చెందగా, అతని సోదరిని అనారోగ్యంతో ఎగ్మూర్‌ పిల్లల ఆస్పత్రిలో చేర్చారు. ఆమెకు చికిత్స అందించేందుకు రూ.వెయ్యి లంచం ఇచ్చినట్లు బాలిక తండ్రి చెప్పడంతో ప్రభుత్వంపై పలు విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆరోగ్యశాఖ మంత్రి మా.సుబ్రమణియన్‌ మాట్లాడుతూ... ఎగ్మూర్‌ ఆస్పత్రిలో లంచం అడిగారనడంలో వాస్తవం లేదన్నారు. పొరుగు రాష్ట్రాలకు చెందినవారు రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో చికిత్స పొందాలంటే రూ.వెయ్యి డిపాజిట్‌ కట్టాలన్నారు. ఆ తర్వాత ఒక్కో పరీక్షకు వేర్వేరుగా ఫీజు చెల్లించాలని తెలిపారు. ఈ విధానం అన్ని రాష్ట్రాల్లోనూ ఉందన్నారు. ఇది తెలియకుండా ఆరోపణలు చేయడం బాధగా ఉందన్నారు. ఇలాంటి ఆరోపణలతో వైద్య సిబ్బంది మనస్తాపానికి గురవుతారన్నారు. బాలుడి మృతికి కలుషితనీరు తాగడం కారణం కాదని నిర్ధారణైందన్నారు. వారు ఉంటున్న ప్రాంతంలో 625 కుటుంబాలు ఉంటున్నాయని, వారందరికీ ఆరోగ్యం బాగానే ఉందన్నారు. బాలుడి మృతికి కారణాలు పోస్ట్‌మార్టంలో తెలుస్తాయన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని