logo

ఘనంగా వేదవిజ్ఞాన వేదిక 150వ ప్రసంగం

వేద విజ్ఞాన వేదిక 150వ ప్రసంగ కార్యక్రమం ఆదివారం ఘనంగా జరిగింది. సంస్థ తరఫున ప్రతీ నెలా నిర్వహించే తరతరాల తెలుగు కవిత ఉపన్యాస ధారావాహికలో భాగంగా ఆదివారం చెన్నై టీనగర్‌లోని ఆంధ్రా క్లబ్‌ కృష్ణా హాలు వేదికగా 150వ ప్రసంగ కార్యక్రమం జరిగింది.

Published : 01 Jul 2024 01:11 IST

టీనగర్, న్యూస్‌టుడే: వేద విజ్ఞాన వేదిక 150వ ప్రసంగ కార్యక్రమం ఆదివారం ఘనంగా జరిగింది. సంస్థ తరఫున ప్రతీ నెలా నిర్వహించే తరతరాల తెలుగు కవిత ఉపన్యాస ధారావాహికలో భాగంగా ఆదివారం చెన్నై టీనగర్‌లోని ఆంధ్రా క్లబ్‌ కృష్ణా హాలు వేదికగా 150వ ప్రసంగ కార్యక్రమం జరిగింది. ‘సాహిత్యం - చమత్కార వైభవం’ అంశంపై ముంబయికి చెందిన సారస్వతోపాసకులు సాంప్రతి సురేంద్రనాథ్‌ వక్తగా పాల్గొని ప్రసంగించారు. సాహిత్యంలో చమత్కారం అనేది ఏంటో అనేక ఉదాహరణలతో వివరించారు. శ్రోతలను ఆకట్టుకోవడానికి చమత్కారం ప్రధాన పాత్ర పోషిస్తుందన్నారు. అనేకమంది కవులు తమ రచనల్లో వెల్లడించిన చమత్కారాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ముందుగా కార్యక్రమంలో వేద విజ్ఞాన వేదిక సంస్థ కార్యదర్శి కందనూరు మధు స్వాగతం పలికారు. కొన్ని అనివార్య కారణాల వల్ల సంస్థ అధ్యక్షుడు జేకే రెడ్డి కార్యక్రమానికి హాజరు కాలేకపోవడంతో ఆయన కుమారుడు విజయ్‌ రెడ్డి హాజరై వక్తను జ్ఞాపికతో సత్కరించారు. అనేక ప్రాంతాల నుంచి సాహితీ ప్రియులు కార్యక్రమానికి హాజరయ్యారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని