logo

మహిళలకు ప్రత్యేక తిరునాల

వేలూర్‌ జిల్లా ఓడుగత్తూర్‌ సమీపం తొంగుమలై గ్రామంలో 3 వేల మందికి పైగా గిరిజనులు నివసిస్తున్నారు. ఇక్కడ వందేళ్లకు పైగా జరుగుతున్న కాళియమ్మన్‌ ఆలయ ఉత్సవం 48 రోజుల క్రితం ప్రారంభమైంది.

Published : 01 Jul 2024 01:10 IST

వధూవరుల వేషధారణలో బాలికలు

వేలూర్, న్యూస్‌టుడే: వేలూర్‌ జిల్లా ఓడుగత్తూర్‌ సమీపం తొంగుమలై గ్రామంలో 3 వేల మందికి పైగా గిరిజనులు నివసిస్తున్నారు. ఇక్కడ వందేళ్లకు పైగా జరుగుతున్న కాళియమ్మన్‌ ఆలయ ఉత్సవం 48 రోజుల క్రితం ప్రారంభమైంది. సాంప్రదాయం ప్రకారం గిరిజన మహిళలు వ్రతం ఆచరించి అమ్మవారిని పూజిస్తారు. ఈ నేపథ్యంలో శనివారం మహిళలు మాత్రమే పాల్గొనే తిరునాల జరిగింది. ఈ సందర్భంగా మహిళలంతా ఒకచోట చేరి సాంప్రదాయ నృత్యం చేశారు. అనంతరం ఇద్దరు బాలికలకు వివాహ దుస్తులు ధరింపజేసి, వారికి వివాహం చేసినట్లుగా కార్యక్రమం నిర్వహించారు. వారిని దైవంగా భావించి పూజించారు. ఈ తిరునాలలో పురుషులు పాల్గొనకూడదని, అలా చేస్తే వారిని తరిమికొడతారని గ్రామస్థులు తెలిపారు.

ఉత్సవంలో పాల్గొన్న మహిళలు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని