logo

భక్తుల సేవే పరమావధి

సామాన్య భక్తులకు ఇబ్బందులు లేకుండా సంతృప్తికర దర్శనం అందుబాటులోనికి తీసుకువచ్చేలా చర్యలు తీసుకుంటానని ముక్కంటి ఆలయ నూతన ఈవో, తిరుపతి ఆర్జేసీ ఎస్‌.వి.ఎన్‌.ఎస్‌.మూర్తి అన్నారు.

Published : 01 Jul 2024 01:09 IST

ఈవోగా బాధ్యతలు చేపట్టిన ఎస్‌.వి.ఎన్‌.ఎస్‌.మూర్తి

శ్రీకాళహస్తి, న్యూస్‌టుడే: సామాన్య భక్తులకు ఇబ్బందులు లేకుండా సంతృప్తికర దర్శనం అందుబాటులోనికి తీసుకువచ్చేలా చర్యలు తీసుకుంటానని ముక్కంటి ఆలయ నూతన ఈవో, తిరుపతి ఆర్జేసీ ఎస్‌.వి.ఎన్‌.ఎస్‌.మూర్తి అన్నారు. శ్రీకాళహస్తీశ్వరాలయ ఈవోగా ఆదివారం ఆయన బాధ్యతలు చేపట్టారు. ఇదివరకు విధులు నిర్వహిస్తున్న ఎస్‌.వి.నాగేశ్వరరావు పదవీ విరమణ చేయడంతో ఆయన నుంచి బాధ్యతలు స్వీకరించారు. తొలుత శ్రీజ్ఞానప్రసూనాంబిక సమేత శ్రీకాళహస్తీశ్వరుని దర్శించుకున్నారు. అనంతరం బాధ్యతలు చేపట్టారు. మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాల సమయంలో బ్రహ్మోత్సవ ప్రత్యేక అధికారిగా ఈయన విధులు నిర్వహించారు. ఈయనకు ఆలయ డిప్యూటీ కమిషనర్‌ ఏకాంబరం, ఏసీ మల్లికార్జునప్రసాద్‌లు దగ్గరుండి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు పర్యవేక్షించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని