logo

యుద్ధ ట్యాంకులో ఒరిగిన వీరుడా.. వందనం

దేశ సేవే తన ప్రథమ కర్తవ్యంగా భావించారు. విధి నిర్వహణలో భాగంగా లద్దాఖ్‌ ప్రాంతంలో యుద్ధ ట్యాంకులో నది దాటుతూ మృత్యువుకు చిక్కారు.

Published : 03 Jul 2024 02:11 IST

రామకృష్ణారెడ్డి (పాత చిత్రం)

మాతృభూమిపై మక్కువతో సైన్యంలో చేరారు. దేశ సేవే తన ప్రథమ కర్తవ్యంగా భావించారు. విధి నిర్వహణలో భాగంగా లద్దాఖ్‌ ప్రాంతంలో యుద్ధ ట్యాంకులో నది దాటుతూ మృత్యువుకు చిక్కారు. అకస్మాత్తుగా వచ్చిన వరద నీటి ప్రవాహంలో కొట్టుకుపోయి ఇటీవల వీర మరణం పొందారు. వీర సైనికుడు ముత్తుముల రామకృష్ణారెడ్డి(47) అంత్యక్రియలను స్వగ్రామమైన రాచర్ల మండలం కాలువపల్లిలో అశ్రునయనాల మధ్య అధికారిక లాంఛనాలతో మంగళవారం నిర్వహించారు.

న్యూస్‌టుడే, కంభం(రాచర్ల)

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని