logo

అక్షర యోధుడికి స్వరాంజలి

చివరి క్షణం వరకు సమాజ శ్రేయస్సు కోసం పరితపించిన గొప్ప వ్యక్తి రామోజీరావు అని ఏపీ మహిళాభ్యుదయ సమితి రాష్ట్ర అధ్యక్షురాలు టి.అరుణ కొనియాడారు.

Published : 01 Jul 2024 06:15 IST

రామోజీరావు చిత్రపటం వద్ద అంజలి ఘటిస్తున్న వివిధ రంగాల ప్రతినిధులు 

ఒంగోలు గ్రామీణం, న్యూస్‌టుడే: చివరి క్షణం వరకు సమాజ శ్రేయస్సు కోసం పరితపించిన గొప్ప వ్యక్తి రామోజీరావు అని ఏపీ మహిళాభ్యుదయ సమితి రాష్ట్ర అధ్యక్షురాలు టి.అరుణ కొనియాడారు. క్రియేటివ్‌ కల్చరల్‌ అకాడమీ ఆధ్వర్యంలో ఆయనకు ‘స్వర నివాళి’ అర్పిస్తూ... ఒంగోలు సీవీఎన్‌ క్లబ్‌ ఆవరణలో ఆదివారం రాత్రి ‘పాడుతా తీయగా’ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఆమె మాట్లాడుతూ స్వయం కృషితో ఉన్నత శిఖరాలు అధిరోహించిన మహనీయుడని కీర్తించారు. ‘ఈనాడు’ పత్రిక ఏర్పాటుతో సామాన్యుడికి అండగా నిలిచి... వేలాది జీవితాల్లో వెలుగులు నింపారన్నారు. అడుగిడిన ప్రతి రంగంలో తనదైన ప్రత్యేకత చాటారన్నారు. ఆయన వ్యక్తిత్వం అందరికీ ఆదర్శనీయమన్నారు. కల్చరల్‌ అకాడమీ అధ్యక్షుడు పి.శివ, జిల్లా గ్రంథాలయ సంస్థ విశ్రాంత ఉద్యోగుల గౌరవ అధ్యక్షుడు జి.గురవారెడ్డి, వేదిక సంస్థ అధ్యక్షురాలు షేక్‌ సిద్దాంబీ, రంగభూమి కళాకారుల సంఘం ప్రధాన కార్యదర్శి అంగలకుర్తి ప్రసాద్, ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు. ఔత్సాహక గాయనీగాయకులు పలు గీతాలు ఆలపించి స్వరాంజలి ఘటించారు. ముందుగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని