logo

రెండొందల బస్తాల బియ్యం పట్టివేత

పామూరులోని ఆర్టీసీ బస్‌స్టేషన్‌కు సమీపంలోని ప్రైవేటు గోదాము సముదాయంలో అక్రమంగా నిల్వ ఉంచిన రేషన్‌ బియ్యాన్ని పోలీసులు, రెవెన్యూ సిబ్బంది శనివారం రాత్రి స్వాధీనం చేసుకున్నారు.

Published : 01 Jul 2024 06:13 IST

వైకాపా నాయకుడిపై కేసు

బియ్యం బస్తాలు పరిశీలిస్తున్న ఎస్సై సైదుబాబు 

పామూరు, న్యూస్‌టుడే: పామూరులోని ఆర్టీసీ బస్‌స్టేషన్‌కు సమీపంలోని ప్రైవేటు గోదాము సముదాయంలో అక్రమంగా నిల్వ ఉంచిన రేషన్‌ బియ్యాన్ని పోలీసులు, రెవెన్యూ సిబ్బంది శనివారం రాత్రి స్వాధీనం చేసుకున్నారు. అక్రమంగా రేషన్‌ బియ్యం నిల్వ ఉంచినట్లు పోలీసులకు వచ్చిన పక్కా సమాచారం మేరకు సీఐ రామానాయక్, ఎస్సై ఎం.సైదుబాబు, వీఆర్వోలు షేక్‌ ఖాజారఫీ, రఫీఅహ్మద్‌ శనివారం రాత్రి సమయంలో గోదాము తాళాలు తీయించి తనిఖీలు చేపట్టారు. గోదాములో 200 బస్తాలు (100 క్వింటాళ్లు) రేషన్‌ బియ్యం ఉండడంతో వాటిని స్వాధీనం చేసుకున్నారు. వైకాపా నాయకుడు, సింగిల్‌విండో డైరెక్టర్‌ చెనికల శ్రీనివాసులు రేషన్‌ బియ్యం కొనుగోలు చేసి అక్రమ వ్యాపారం చేస్తున్నారు. స్వాధీనం చేసుకున్న రేషన్‌ బియ్యానికి బాధ్యుడైన చెనికల  శ్రీనివాసులుపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై ఎం.సైదుబాబు స్పష్టం చేశారు. ఈ బియ్యాన్ని ఫౌరసరఫరాల శాఖ గోదాము సిబ్బందికి స్వాధీనం చేసినట్లు తెలిపారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు