logo

ఉచిత వైద్య శిబిరానికి భారీ స్పందన

తెదేపా నేతలు గొట్టిపాటి లక్ష్మి, కడియాల లలిత్‌సాగర్‌ ఆధ్వర్యంలో ఆదివారం చేపట్టిన ఉచిత మెగా వైద్య శిబిరానికి ప్రజల నుంచి భారీ స్పందన లభించింది.

Published : 01 Jul 2024 06:08 IST

దర్శిలో శిబిరాన్ని ప్రారంభిస్తున్న లక్ష్మి, హాజరైన రోగులు

దర్శి, న్యూస్‌టుడే: తెదేపా నేతలు గొట్టిపాటి లక్ష్మి, కడియాల లలిత్‌సాగర్‌ ఆధ్వర్యంలో ఆదివారం చేపట్టిన ఉచిత మెగా వైద్య శిబిరానికి ప్రజల నుంచి భారీ స్పందన లభించింది. స్థానిక ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ప్రాంగణంలో ఏర్పాటుచేసిన శిబిరాన్ని మాజీ ఎమ్మెల్యే నారపుశెట్టి పాపారావు, నగరపంచాయతీ చైర్మన్‌ పిచ్చయ్యతో కలిసి లక్ష్మి ప్రారంభించారు. నియోజకవర్గంలోని అయిదు మండలాలకు చెందిన 5,260 మంది ఓపీలు నమోదు చేసుకున్నట్లు నిర్వాహకులు తెలిపారు. పలు విభాగాలకు చెందిన 20 మంది నిపుణుల  బృందం రోగులకు వైద్య సేవలందించారు. రక్త,ం ఎక్స్‌రే, స్కానింగ్‌ వంటి పరీక్షలు నిర్వహించటంతో పాటు ప్రతి ఒక్కరినీ పరీక్షించి అవసరమైన వారికి ఉచితంగా మందులు అందజేశారు. ఉదయం నుంచే ఓపీ కౌంటర్ల వద్ద భారీ క్యూ కనిపించింది. వచ్చిన వారికి అసౌకర్యం కలగకుండా ఆహారం, పండ్లు, తాగునీరు వంటి వాటిని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా లక్ష్మి మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలకు సేవలందించేందుకు చేపట్టిన వైద్య శిబిరానికి మంచి స్పందన రావటం సంతోషాన్నిచ్చిందన్నారు.  సేవలు అందించిన వారిలో లక్ష్మితో పాటు డా.కడియాల వెంకటేశ్వరరావు, లలిత్‌సాగర్, సుధీర్, హిందూజా తదితరులు ఉన్నారు. శిబిరానికి వచ్చిన వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తెదేపా నాయకులు, కార్యకర్తలు తగు ఏర్పాట్లు చేశారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు