logo

ట్రిపుల్‌ ఐటీలో ప్రవేశాల ప్రక్రియ ప్రారంభం

ఆర్‌జేయూకేటీ ట్రిపుల్‌ ఐటీలో నూతన విద్యా సంవత్సరం ప్రవేశాల ప్రక్రియ ప్రారంభమైంది. ఈనెల 25వ తేదీతో దరఖాస్తులు సమర్పించే గడువు ముగిసింది.

Published : 29 Jun 2024 04:09 IST

ఒంగోలు ట్రిపుల్‌ఐటీ ప్రాంగణం 

ఒంగోలు నగరం, న్యూస్‌టుడే: ఆర్‌జేయూకేటీ ట్రిపుల్‌ ఐటీలో నూతన విద్యా సంవత్సరం ప్రవేశాల ప్రక్రియ ప్రారంభమైంది. ఈనెల 25వ తేదీతో దరఖాస్తులు సమర్పించే గడువు ముగిసింది. రాష్ట్రంలోని నాలుగు ప్రాంగణాలకు సంబంధించి మొత్తం 53,863 మంది దరఖాస్తు చేసుకున్నారు. వారిలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు 34,154 మంది, ప్రైవేటు పాఠశాలల నుంచి 19,671 మంది, పక్క రాష్ట్రాల నుంచి 38 మంది దరఖాస్తు చేయగా, వారిలో బాలికలు 30,857, బాలురు 23,006 మంది ఉన్నారు. ప్రత్యేక కేటగిరీ సైనిక సంతతి విభాగంలో 2,582, ఎన్‌సీసీ నుంచి 1,830, స్పోర్ట్స్‌ కోటా కింద 1,162 మంది, దివ్యాంగుల కేటగిరీలో 332 మంది, స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌ విభాగంలో 270 మంది దరఖాస్తు చేశారు. వారికి నూజివీడు ప్రాంగణంలో దరఖాస్తుల పరిశీలన జరుగుతుంది. సైనిక సంతతి వారికి జులై ఒకటి నుంచి మూడు వరకు, ఎస్‌సీసీ వారికి 3 నుంచి 5, దివ్యాంగులకు మూడో తేదీన, స్పోర్ట్స్‌ కేటగిరీకి 3 నుంచి 5 తేదీల్లో స్కౌట్స్‌ విభాగానికి రెండు, మూడు తేదీల్లో దరఖాస్తుల పరిశీలన జరుగుతుంది.

జులై 11న జాబితా:  ఎంపిక జాబితాను జులై 11న విడుదల చేస్తారు. ధ్రువపత్రాల పరిశీలన నూజివీడు, ఇడుపులపాయలో జులై 22, 23 తేదీల్లో, ఒంగోలు ప్రాంగణంలో 24, 25 తేదీల్లో, శ్రీకాకుళంలో 26, 27 తేదీల్లో జరుగుతుందని ప్రవేశాల కన్వీనర్‌ ఎస్‌.అమరేంద్రకుమార్‌ ఓ ప్రకటనలో తెలిపారు. దరఖాస్తు చేసేటప్పుడు ప్రత్యేక కేటగిరీ దృవపత్రం పెట్టడం మరచిపోయినవారు సంబంధిత పత్రం తీసుకొని నిర్ణీత తేదీల్లో పరిశీలనకు నూజివీడు రావచ్చన్నారు. అభ్యర్థి మెరిట్, కేటగిరీ ప్రకారం ఆన్‌లైన్‌ దరఖాస్తులో ఇచ్చిన ప్రాధాన్యం ఆధారంగా ప్రాంగణాన్ని కేటాయిస్తామన్నారు. ప్రవేశం పూర్తయ్యాక ప్రాంగణాల అంతర్గత బదిలీకి అనుమతించేది లేదని స్పష్టంచేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని