logo

సమస్యల పరిష్కారం అందరి బాధ్యత

‘ప్రజా సమస్యల పరిష్కారం అధికారులందరి బాధ్యత. అందుకుగాను ప్రతి ఒక్కరూ జవాబుదారీతనం, నిజాయతీతో విధులు నిర్వర్తించాల్సిన అవసరం ఉంది’ అని కలెక్టర్‌ తమీమ్‌ అన్సారియా అధికారులకు సూచించారు

Published : 29 Jun 2024 03:59 IST

మాట్లాడుతున్న కలెక్టర్‌ తమీమ్‌ అన్సారియా, చిత్రంలో ఇన్‌ఛార్జి డీఆర్వో విశ్వేశ్వరరావు.. సమావేశానికి హాజరైన జిల్లా అధికారులు  
ఒంగోలు గ్రామీణం, న్యూస్‌టుడే: ‘ప్రజా సమస్యల పరిష్కారం అధికారులందరి బాధ్యత. అందుకుగాను ప్రతి ఒక్కరూ జవాబుదారీతనం, నిజాయతీతో విధులు నిర్వర్తించాల్సిన అవసరం ఉంది’ అని కలెక్టర్‌ తమీమ్‌ అన్సారియా అధికారులకు సూచించారు. ఒంగోలు ప్రకాశం భవన్‌లోని సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో ఆమె శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలు కచ్చితంగా పాటించాలన్నారు. సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి చేరేలా కృషి చేయాలని చెప్పారు. ప్రభుత్వ ప్రాధాన్యతా అంశాలపై ప్రత్యేక దృష్టి సారించి, నిర్దేశించిన లక్ష్యాలను సకాలంలో సాధించేందుకు కృషి చేయాలని తెలిపారు. అర్జీదారులకు సంతృప్తికరమైన పరిష్కారం చూపాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. తొలుత శాఖల వారీగా ప్రాధాన్యతా కార్యక్రమాల గురించి అడిగి తెలుసుకున్నారు. సమావేశంలో ఇన్‌ఛార్జి డీఆర్వో విశ్వేశ్వరరావుతో పాటు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని