logo

ఎట్టకేలకు చిక్కిన చిరుత

వనాన్ని వీడి గిద్దలూరు మండలం గడికోట పంచాయతీ దేవనగరం గ్రామ సమీపంలోకి వచ్చిన చిరుత.. అక్కడి పాత పేపరు మిల్లుకు చెందిన ఖాళీ స్థలంలోని ఓ గుంతలో పడింది.

Updated : 28 Jun 2024 04:58 IST


అటవీ శాఖ అధికారులు బంధించిన చిరుత పులి 

గిద్దలూరు పట్టణం, న్యూస్‌టుడే: వనాన్ని వీడి గిద్దలూరు మండలం గడికోట పంచాయతీ దేవనగరం గ్రామ సమీపంలోకి వచ్చిన చిరుత.. అక్కడి పాత పేపరు మిల్లుకు చెందిన ఖాళీ స్థలంలోని ఓ గుంతలో పడింది. ఈ విషయాన్ని బుధవారం సాయంత్రం తెలుసుకున్న గిద్దలూరు అటవీ శాఖ అధికారులు.. సురక్షితంగా బయటికి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేశారు. తొలుత గుంతలో నిచ్చెన ఏర్పాటు చేయగా.. ఎక్కినట్టే ఎక్కి కింద పడిపోయిన చిరుత అక్కడే ఉండి పోయింది. గురువారం ఉదయం గిద్దలూరు అటవీ శాఖ డిప్యూటీ డైరెక్టర్‌ నరసింహరావు, సబ్‌ డీఎఫ్‌వో శ్రీకాంత్‌రెడ్డి, గిద్దలూరు రేంజర్‌ కుమార రాజా సంఘటనా స్థలానికి చేరుకున్నారు. చిరుతకు ఎరగా బోనులో మేకపిల్లను ఏర్పాటు చేసి ఉంచారు. మధ్యాహ్న సమయంలో గుంత నుంచి బయటకు వచ్చి అటూ తిరిగిన చిరుత.. తిరిగి లోపలికే వెళ్లింది. అనంతరం దేవనగరం చేరుకున్న శ్రీశైలం టైగర్‌ ప్రాజెక్టు ఫీల్డ్‌ డైరెక్టర్‌ బీఎన్‌ఎన్‌.మూర్తి అక్కడికి వచ్చారు. బోనును గుంతకు అతి సమీపంలో ఉంచేలా ఏర్పాట్లు చేయించారు. ఎట్టకేలకు గురువారం రాత్రి చిరుత పులి గుంత నుంచి బయటికొచ్చి బోనులో చిక్కుకుంది. అనంతరం ప్రత్యేక వాహనంలో గిద్దలూరు అటవీ శాఖË డివిజన్‌ పరిధిలోని నల్లమల అటవీ ప్రాంతంలో వదిలి పెట్టారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని