logo

రూ.199.07 కోట్ల ఎన్టీఆర్‌ భరోసా

ఎన్టీఆర్‌ భరోసా పింఛను కింద జిల్లాలోని అన్ని విభాగాలకు సంబంధించి 2,91,524 మంది లబ్ధిదారులకు రూ.199.07 కోట్ల మేర నిధులు మంజూరయ్యాయి.

Published : 28 Jun 2024 04:34 IST

ఒంగోలు గ్రామీణం, న్యూస్‌టుడే: ఎన్టీఆర్‌ భరోసా పింఛను కింద జిల్లాలోని అన్ని విభాగాలకు సంబంధించి 2,91,524 మంది లబ్ధిదారులకు రూ.199.07 కోట్ల మేర నిధులు మంజూరయ్యాయి. ఈ నెల 29న బ్యాంక్‌ల నుంచి నగదు డ్రా చేసేలా సచివాలయ ఉద్యోగులకు ఆదేశాలు అందాయి. జులై 1నే ఇంటి వద్దనే సచివాలయ ఉద్యోగులతో వంద శాతం పింఛన్లు పంపిణీ చేసేలా చర్యలు చేపట్టారు. లేకుంటే తర్వాత రోజున పూర్తి చేయాల్సి ఉంటుంది. పింఛను సొమ్మును రూ.3 వేల నుంచి రూ.4 వేలకు తెదేపా ప్రభుత్వం పెంచింది. ఈ నేపథ్యంలో జులై ఒకటిన రూ.4 వేలతో పాటు, ఏప్రిల్, మే, జూన్‌ నెలకు సంబంధించి పెరిగిన సొమ్ము నెలకు రూ.1,000 చొప్పున మొత్తం రూ.7 వేలు అందించనున్నారు.

ఒక్కో ఉద్యోగికి 50 గృహాలు చొప్పున పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని అప్పగించేలా క్లస్టర్ల వారీగా మ్యాపింగ్‌ చేపట్టనున్నారు. పంపిణీకి అవసరమైతే ఇతర శాఖల ఉద్యోగుల సేవలను వినియోగించుకుంటారు. పంపిణీ ముందస్తు చర్యలపై జిల్లాలోని ఎంపీడీవోలు, మున్సిపల్‌ కమిషనర్లు, డీఆర్డీఏ పీడీ వసుంధర, డీపీవో ఉషారాణి, ఇతర అధికారులతో కలెక్టర్‌ తమీమ్‌ అన్సారియా గురువారం టెలీ కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని