logo

స్వామి.. చదువుల సంతకం

వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక స్థానిక సైన్సు విద్యార్థుల కలను వమ్ము చేసింది. గత తెదేపా ప్రభుత్వ హయాంలో  స్థానిక గురుకుల బాలికల పాఠశాలలో ఇంటర్‌ సీఈసీ విభాగంలో 80, సైన్సు విభాగానికి 80 సీట్లు కేటాయించింది.

Published : 28 Jun 2024 04:23 IST

గురుకుల పాఠశాలలో సీట్ల పునరుద్ధరణ
హామీ నిలబెట్టుకున్న మంత్రి
సింగరాయకొండ గ్రామీణం, న్యూస్‌టుడే

వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక స్థానిక సైన్సు విద్యార్థుల కలను వమ్ము చేసింది. గత తెదేపా ప్రభుత్వ హయాంలో  స్థానిక గురుకుల బాలికల పాఠశాలలో ఇంటర్‌ సీఈసీ విభాగంలో 80, సైన్సు విభాగానికి 80 సీట్లు కేటాయించింది. అనంతరం జగన్‌ ముఖ్యమంత్రి అయ్యాక   కేవలం సోషల్‌ విభాగం సీట్లు మాత్రమే భర్తీ చేస్తూ సైన్సు విభాగంలో ఖాళీలను   రద్దు చేయడంతో విద్యార్థులకు దిక్కుతోచని పరిస్థితి నెలకొంది. తమ పిల్లల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు గతంలలో ఎమ్మెల్యే బాలవీరాంజనేయ స్వామిని కలిసి సమస్యను విన్నవించారు. తాము  అధికారంలోకి రాగానే సైన్సు విభాగం సీట్లు పునరుద్ధరిస్తామని ఆయన అప్పట్లో హామీ ఇచ్చారు. తాజాగా ఆయన వెలగపూడి రాష్ట్ర సచివాలయంలో సాంఘిక సంక్షేమ మంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తూ సంతకం చేశారు. ఈ మేరకు సింగరాయకొండ గురుకుల పాఠశాలలో 2024/25 విద్యా సంవత్సరానికిగానూ సైన్స్‌ విభాగంలో 80 సీట్లు అందుబాటులోకి రానున్నాయి. విద్యార్థులు ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాలని ఆయన కోరారు.

 సైన్సు విభాగం సీట్లు పునరిద్ధరిస్తూ సంతకం చేస్తున్న మంత్రి బాలవీరాంజనేయ స్వామి

ఆదేశాలొచ్చాయి..

సీట్ల భర్తీపై గురుకుల పాఠశాల ప్రిన్సిపల్‌ రమాదేవిని వివరణ కోరగా ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వచ్చాయని, ఇప్పటికే సుమారు 200 మంది విద్యార్థినులు దరఖాస్తులు అందించారన్నారు. త్వరలో అర్హత ఆధారంగా ముఖాముఖి నిర్వహించి సీట్ల భర్తీకి చర్యలు చేపడతామని తెలిపారు. దీంతో ఆయా ప్రాంతాల విద్యార్థుల తలిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని