logo

‘కోడికత్తి’ శ్రీనుకు న్యాయం జరిగేలా చూస్తాం

కోడి కత్తి శ్రీనుకు అన్ని విధాలా న్యాయం జరిగే విధంగా చూస్తామని మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు బిళ్లా వసంతరావు భరోసా ఇచ్చారు. వైకాపా ప్రభుత్వ హయాంలో వేధింపులకు గురైన శ్రీనును స్థానిక కలెక్టరేట్‌ సమీపంలోని అంబేడ్కర్‌ విగ్రహం వద్ద మంగళవారం ఘనంగా సన్మానించారు.

Published : 26 Jun 2024 01:36 IST

శ్రీనును సన్మానిస్తున్న మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు బిళ్లా వసంతరావు తదితరులు

ఒంగోలు గ్రామీణం, న్యూస్‌టుడే: కోడి కత్తి శ్రీనుకు అన్ని విధాలా న్యాయం జరిగే విధంగా చూస్తామని మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు బిళ్లా వసంతరావు భరోసా ఇచ్చారు. వైకాపా ప్రభుత్వ హయాంలో వేధింపులకు గురైన శ్రీనును స్థానిక కలెక్టరేట్‌ సమీపంలోని అంబేడ్కర్‌ విగ్రహం వద్ద మంగళవారం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కోడి కత్తి శ్రీను అంశాన్ని మాజీ ముఖ్యమంత్రి జగన్‌ 2019 ఎన్నికల్లో పెద్దఎత్తున ప్రచారం చేసి ఆ సానుభూతితో గెలిచారన్నారు. ఆ సంఘటనను సాకుగా చూపి దళితులను ద్రోహులుగా ముద్ర వేసేందుకూ ఆయన వెనుకాడలేదని ఆవేదన వ్యక్తంచేశారు. త్వరలోనే ముఖ్యమంత్రి చంద్రబాబును కలసి న్యాయం చేయాల్సిందిగా కోరతామన్నారు. కార్యక్రమంలో నాయకులు పి.నాగార్జున, గడ్డం శ్రీనివాసులు, రాజశేఖర్, సాయిరాం తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని