logo

చంద్రన్న విజయంతో..మోకాళ్లపై మెట్లెక్కి..

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం విజయం సాధించడంతో పొన్నలూరు మండలం ముండ్లమూరివారిపాలెం గ్రామానికి చెందిన తెదేపా అభిమాని నల్లూరి బాలయ్య మోకాళ్లపై మెట్లు ఎక్కి మొక్కు తీర్చుకున్నాడు.

Published : 26 Jun 2024 01:36 IST

కోటప్పకొండను మోకాళ్లపై ఎక్కుతున్న నల్లూరి బాలయ్య

పొన్నలూరు, న్యూస్‌టుడే: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం విజయం సాధించడంతో పొన్నలూరు మండలం ముండ్లమూరివారిపాలెం గ్రామానికి చెందిన తెదేపా అభిమాని నల్లూరి బాలయ్య మోకాళ్లపై మెట్లు ఎక్కి మొక్కు తీర్చుకున్నాడు. మంగళవారం ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో తెదేపా అధికారంలోకి రాగానే కోటప్పకొండలోని త్రికోటేశ్వర స్వామి వద్దకు మోకాళ్లపై నడిచి వెళతానని మొక్కుకున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు, కొండపి ఎమ్మెల్యేగా స్వామి గెలిచి, మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. దీంతో మంగళవారం ఆయన మొక్కుతీర్చుకున్నారు. రాష్ట్రంలో ఆంధ్రుల కల అమరావతి రాజధాని చంద్రబాబుతోనే నెరవేరుతుందని హర్షం వ్యక్తంచేశారు. ఈ సందర్భంగా ఆయన వెంట ముండ్లమూరి వెంకటేశ్వర్లు తదతరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని