logo

ఆస్తి రాయించుకుని..అమ్మను రోడ్డు పాల్జేసి..

నవ మాసాలు మోసి..కన్న ఆ మాతృమూర్తి పట్ల కుమారుడు అమానుషంగా ప్రవర్తించాడు.

Published : 25 Jun 2024 03:02 IST

మార్కాపురం నేర విభాగం న్యూస్‌టుడే: నవ మాసాలు మోసి..కన్న ఆ మాతృమూర్తి పట్ల కుమారుడు అమానుషంగా ప్రవర్తించాడు. ఆస్తిని తన పేర రాయించుకొని ఆమెను రోడ్డున పడేశాడు. ఈ మేరకు బాధితురాలి ఫిర్యాదుతో కుమారుడు, కోడలిపై పోలీసులు సోమవారం కేసు నమోదు చేశారు. వారి కథనం ప్రకారం...స్థానిక విద్యుత్తు కార్యాలయం వెనుక నివాసం ఉండే వెన్నా సావిత్రమ్మ(80)కు ఇద్దరు కుమారులున్నారు. 2000లో భర్త మృతి చెందారు. ఆ తదనంతరం చిన్న కుమారుడైన వెన్నా శ్రీనివాసరెడ్డి ఆమె పేర ఉన్న ఇంటిని రాయించుకున్నాడు. అయితే గత కొంతకాలం నుంచి కుమారుడు శ్రీనివాసరెడ్డి, కోడలు భూలక్ష్మి కలిసి సావిత్రమ్మను నిత్యం వేధిస్తున్నారు. ఆమెను బెదిరించి ఇంటి నుంచి వెళ్లగొట్టేశారు. దీంతో దిక్కుతోచని ఆ వృద్ధ మాతృమూర్తి సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పట్టణ ఎస్సై అబ్దుల్‌ రెహమాన్‌ చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు