logo

అల్లూరి పోరాటం స్ఫూర్తిదాయకం

అల్లూరి పోరాట స్ఫూర్తి ఎంతో గొప్పదని, ప్రతి ఒక్కరూ ఆయనను ఆదర్శంగా తీసుకోవాలని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు అశోక్‌ గజపతిరాజు అన్నారు.

Published : 05 Jul 2024 02:30 IST

జ్యోతి వెలిగిస్తున్న అశోక్‌ గజపతిరాజు, చిత్రంలో ఎమ్మెల్సీ రఘువర్మ, ఎమ్మెల్యే అదితి తదితరులు

మయూరి కూడలి, న్యూస్‌టుడే: అల్లూరి పోరాట స్ఫూర్తి ఎంతో గొప్పదని, ప్రతి ఒక్కరూ ఆయనను ఆదర్శంగా తీసుకోవాలని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు అశోక్‌ గజపతిరాజు అన్నారు. సీతారామరాజు జయంతి సందర్భంగా అల్లూరి సీతారామరాజు సేవా సమితి ఆధ్వర్యంలో దాసన్నపేట రైతుబజారుతో పాటు రింగురోడ్డు సమీపంలోని క్షత్రియ పరిషత్‌ భవన్‌లో ఉన్న విగ్రహానికి ఎమ్మెల్యే అదితి గజపతిరాజు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పాకలపాటి రఘువర్మతో కలిసి నివాళులర్పించారు. చిన్నతనం నుంచే నాయకత్వ లక్షణాలు అవసరమని ఈ సందర్భంగా అశోక్‌ చెప్పారు. అన్యాయాన్ని ఎదిరించేతత్వం ఉండాలని పేర్కొన్నారు. ఎమ్మెల్సీ పెనుమత్స సూర్యనారాయణ రాజు, సేవా సమితి సభ్యులు కేఏపీ.రాజు, సాగి శివాజీ రాజు, ఐవీపీ.రాజు, సూర్యనారాయణరాజు తదితరులు పాల్గొన్నారు.

చిరస్మరణీయుడు

ఉడాకాలనీ: పిన్న వయసులోనే దేశం కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన దేశభక్తుడు అల్లూరి సీతారామరాజు అని, ఆయన పోరాటాలు, దేశభక్తిని నేటి యువత తెలుసుకోవాలని కలెక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌ సూచించారు. గురువారం కలెక్టరేట్‌ ఆడిటోరియంలో అల్లూరి జయంతి వేడుకలు నిర్వహించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని