logo

ప్రసూతి మరణాలు సంభవిస్తే చర్యలు

జిల్లాలో ఒక్క ప్రసూతి మరణం సంభవించినా సంబంధిత అధికారులు, సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌ హెచ్చరించారు.

Published : 05 Jul 2024 02:29 IST

అధికారులకు సూచనలు చేస్తున్న కలెక్టర్‌ అంబేడ్కర్‌

విజయనగరం ఉడాకాలనీ, న్యూస్‌టుడే: జిల్లాలో ఒక్క ప్రసూతి మరణం సంభవించినా సంబంధిత అధికారులు, సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌ హెచ్చరించారు. గురువారం కలెక్టరేట్‌లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఫిబ్రవరి నుంచి ఏప్రిల్‌ వరకు ఏడు మాతృ, శిశు మరణాలు జరిగాయని చెప్పారు. ఈ మేరకు సంబంధిత కారణాలపై సమీక్షించారు. ముందుగానే లోపాలను గుర్తించాలని చెప్పారు. క్షేత్రస్థాయిలో ఆశా వర్కర్లు, ఏఎన్‌ఎంలు, అంగన్‌వాడీ కార్యకర్తలు ఉన్నారని, వారి సేవలను పక్కాగా ఉపయోగించుకోవాలని ఆదేశించారు. మరింత బాధ్యతాయుతంగా పనిచేయాలని కోరారు. నిర్లక్ష్యం వహిస్తే క్రిమినల్‌ చర్యలు తీసుకోవడానికి కూడా వెనుకాడబోమని స్పష్టం చేశారు. డీఎంహెచ్‌వో ఎస్‌.భాస్కరరావు, డీసీహెచ్‌ఎస్‌ గౌరీశంకర్, డీఐవో అచ్యుతకుమారి తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని