logo

‘వైకాపా కార్యాలయ భవనం అక్రమమే’

పార్వతీపురంలోని వైకాపా జిల్లా కార్యాలయ భవనం అక్రమ నిర్మాణంగా భావిస్తూ రెండో నోటీసు జారీ చేశామని అధికారులు తెలిపారు.

Published : 05 Jul 2024 02:24 IST

కార్యాలయం వద్ద నోటీసు అంటించిన ఉద్యోగులు

పార్వతీపురం పురపాలక, న్యూస్‌టుడే: పార్వతీపురంలోని వైకాపా జిల్లా కార్యాలయ భవనం అక్రమ నిర్మాణంగా భావిస్తూ రెండో నోటీసు జారీ చేశామని అధికారులు తెలిపారు. వైకాపా హయాంలో జన వనరుల శాఖకు చెందిన భూమిలో 1.18 ఎకరాల విస్తీర్ణంలో పనులు ప్రారంభించారు. విలువైన భూమిని నామమాత్రపు ధరకు లీజుకు తీసుకొని నిర్మిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. పట్టణ ప్రణాళిక విభాగం అనుమతులు పొందలేదని పేర్కొంటూ జూన్‌ 25న తొలిసారి నోటీసులిచ్చారు. దీనికి సరైన వివరణ ఇవ్వకపోవడంతో మరోసారి అందజేశామని పుర కమిషనరు శ్రీనివాస్‌ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని