logo

కొండలపై రోడ్ల నిర్మాణానికి పెద్దపీట

గిరిజన ప్రాంతాల్లోని మారుమూల కొండలపైనున్న గ్రామాలకు రహదారుల సౌకర్యం కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఎమ్మెల్యే జగదీశ్వరి తెలిపారు.

Published : 05 Jul 2024 02:23 IST

పారతో మట్టి తీస్తున్న ఎమ్మెల్యే జగదీశ్వరి

గుమ్మలక్ష్మీపురం, న్యూస్‌టుడే: గిరిజన ప్రాంతాల్లోని మారుమూల కొండలపైనున్న గ్రామాలకు రహదారుల సౌకర్యం కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఎమ్మెల్యే జగదీశ్వరి తెలిపారు. గుమ్మలక్ష్మీపురం మండలంలోని ఎగువతాడికొండ నుంచి చాపరాయిజంగిడిభద్ర వరకు రూ.2.60 కోట్లతో 3.5 కిలోమీటర్ల మేర బీటీ రోడ్డు నిర్మాణానికి గురువారం భూమి పూజ చేశారు. గిరిశిఖరాలపై రోడ్ల ఏర్పాటుకు పెద్దపీట వేస్తున్నామన్నారు. గ్రామానికి తొలిసారి ఎమ్మెల్యే వెళ్లడంతో గిరిజనులు డప్పులతో సందడి చేస్తూ స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో తెదేపా మండల కన్వీనర్‌ పి.సుదర్శనరావు, ఈఈ శాంతేశ్వరరావు, డీఈఈ సింహాచలం, నాయకులు పద్మావతి, కళావతి, భారతమ్మ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని