logo

గిరిజన విశ్వవిద్యాలయ భూముల్లో గ్రావెల్‌ అక్రమ తవ్వకాలు

కొత్తవలస మండలం రెల్లి రెవెన్యూలో కేంద్ర గిరిజన విశ్వవిద్యాలయానికి కేటాయించిన కొండపోరంబోకు భూముల్లో కొందరు కంకర (గ్రావెల్‌)ను అక్రమంగా తరలించుకుపోతున్నారు.

Published : 05 Jul 2024 02:12 IST

తవ్వకాలతో చదునుగా మారిన కొండ ప్రాంతం

కొత్తవలస, న్యూస్‌టుడే: కొత్తవలస మండలం రెల్లి రెవెన్యూలో కేంద్ర గిరిజన విశ్వవిద్యాలయానికి కేటాయించిన కొండపోరంబోకు భూముల్లో కొందరు కంకర (గ్రావెల్‌)ను అక్రమంగా తరలించుకుపోతున్నారు. ఈ ప్రాంతంలో పెద్దగా జన సంచారం లేనందున, అక్రమార్కులు గుట్టు చప్పుడు కాకుండా జేసీబీ సాయంతో గ్రావెల్‌ తవ్వి ట్రాక్టర్లు, లారీల్లో తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. ఇక్కడ నాణ్యమైన గ్రావెల్‌ లభిస్తుండడంతో దీనిపై అక్రమార్కుల కన్ను పడింది. ఇంత జరుగుతున్నా రెవెన్యూశాఖ అధికారులెవరూ అటువైపు కన్నెత్తి చూడటం లేదు. దీంతో అక్రమార్కులు చెలరేగిపోతున్నారు. రెండు ప్రాంతాల్లో ఈ తవ్వకాలు జరుగుతున్నాయి. దీనిపై స్థానికుల నుంచి సమాచారం అందుకున్న ‘న్యూస్‌టుడే’ విషయాన్ని మండల రెవెన్యూ పరిశీలకుడు రాజేష్‌ దృష్టికి తీసుకెళ్లగా ఆయన గురువారం స్పందించి ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. సమీపంలో ఓ జేసీబీ ఉండటంతో ఆరా తీశారు. గ్రావెల్‌ తవ్వితే యంత్రాన్ని సీజ్‌ చేస్తామని వారిని హెచ్చరించి అక్కడి నుంచి పంపించేశారు. ఈ ప్రాంతంలో అక్రమ తవ్వకాలు జరగకుండా నిఘా ఉంచాలని వీఆర్వోను ఆయన ఆదేశించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని