logo

సేవలు కొనసాగించాలని నిరసన

గిరిజన సంక్షేమ పాఠశాలలో పనిచేస్తున్న సవర భాషా వాలంటీర్ల సేవలు కొనసాగించాలని ఐటీడీఏ కార్యాలయం ముందు వాలంటీర్లు నిరసన తెలిపారు.

Published : 05 Jul 2024 02:10 IST

నినాదాలు చేస్తున్న భాషా వాలంటీర్లు

పార్వతీపురం, న్యూస్‌టుడే: గిరిజన సంక్షేమ పాఠశాలలో పనిచేస్తున్న సవర భాషా వాలంటీర్ల సేవలు కొనసాగించాలని ఐటీడీఏ కార్యాలయం ముందు వాలంటీర్లు నిరసన తెలిపారు. మిగిలిన ఐటీడీఏల్లో కొనసాగిస్తున్నారని,  ఇక్కడ ఎందుకు జాప్యం చేస్తున్నారని యూటీఎఫ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి మురళీమోహన్‌ నిలదీశారు. దీనిపై డీడీ రుక్మాంగదయ్య మాట్లాడుతూ.. ఎవరికి కేటాయించిన పాఠశాలల్లో వారు పని చేసుకోవచ్చని, ప్రభుత్వం నుంచి బడ్జెట్, ఆదేశాలను అనుసరించి వేతనాలు చెల్లిస్తామన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని