logo

‘అందుకే మంత్రి పదవి రాలేదేమో’

కోమటిపల్లి జ్యోతిబాఫులే బాలుర గురుకుల పాఠశాలలో విద్యార్థులకు ఎమ్మెల్యే బేబినాయన గురువారం విద్యా సామగ్రి కిట్లు పంపిణీ చేశారు.

Published : 05 Jul 2024 02:08 IST

పిల్లలతో నవ్వుతూ బేబినాయన

 కిట్లు అందిస్తున్న ఎమ్మెల్యే బేబినాయన

బొబ్బిలి గ్రామీణం, న్యూస్‌టుడే: కోమటిపల్లి జ్యోతిబాఫులే బాలుర గురుకుల పాఠశాలలో విద్యార్థులకు ఎమ్మెల్యే బేబినాయన గురువారం విద్యా సామగ్రి కిట్లు పంపిణీ చేశారు. ఆయన పిల్లలతో నవ్వుతూ మాట్లాడుతూ ‘నేను డిగ్రీ కూడా పూర్తి చేయలేదు. అందుకేనే మంత్రి పదవి రాలేదేమో’ అని వ్యాఖ్యానించారు. చదువు చాలా అవసరమని, ప్రతి విద్యార్థి చదువుకోవాలనే తెదేపా హయాంలో సీఎం చంద్రబాబు నియోజకవర్గానికి ఒకటి చొప్పున గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేశారన్నారు. ఈ గురుకుల పాఠశాలను జూనియర్‌ కళాశాలగా అప్‌గ్రేడ్‌ చేస్తే బాగుంటుందని ప్రిన్సిపల్‌ పురుషోది కోరగా.. పిరిడిలో ప్లస్‌-2గా అప్‌గ్రేడ్‌ చేసినా చేరడానికి విద్యార్థులు ముందుకు రాలేదని ఎంఈవో వాసుదేవరావు చెప్పారు. గొల్లపల్లి మున్సిపల్‌ ఉన్నత పాఠశాలను అప్‌గ్రేడ్‌ చేయాలని పలువురు చెప్పడంతో.. ఆ దిశగా ప్రయత్నం చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని