logo

ఆ గ్రామాలకు చదువు దూరం

ఆంధ్ర-ఒడిశా సరిహద్దు కుంతేసు పంచాయతీలో గిరిజన గ్రామాలు తినుకు, బద్దడిలో 46 కుటుంబాలు జీవిస్తున్నాయి. ఈ గ్రామాలకు వెళ్లేందుకు సరైన రోడ్లు లేక విద్య, వైద్యం దయనీయమైంది

Published : 03 Jul 2024 05:20 IST

కర్రలే విద్యుత్తు స్తంభాలు  
ఆంధ్ర-ఒడిశా సరిహద్దు కుంతేసు పంచాయతీలో గిరిజన గ్రామాలు తినుకు, బద్దడిలో 46 కుటుంబాలు జీవిస్తున్నాయి. ఈ గ్రామాలకు వెళ్లేందుకు సరైన రోడ్లు లేక విద్య, వైద్యం దయనీయమైంది. ఇక్కడి ప్రజలు మైదాన ప్రాంతానికి చేరాలంటే 12 కిలోమీటర్ల మేర నడవాల్సిన పరిస్థితి. అనారోగ్యానికి గురైతే ఆశాలు ఇచ్చే మందు బిల్లలే దిక్కు. అత్యవసర సమయాల్లో డోలీలు కట్టుకొని ఆసుపత్రులకు వస్తారు. పేరుకే కుంతేసు పంచాయతీలో ఉన్నప్పటికీ నిత్యావసర సరకులకు 10 కిలోమీటర్ల దూరంలోని చినఖేర్జిల పంచాయతీ బట్టిమాగువలసకు వెళ్లాలి. గ్రామంలో విద్యుత్తు స్తంభాలు లేకపోవడంతో కర్రలనే తీగలకు ఆధారంగా ఏర్పాటు చేశారు. గ్రామానికి 12 కిలోమీటర్ల దూరంలో పెదఖేర్జిల ఆశ్రమ పాఠశాల ఉంది. కానీ సరైన రోడ్డు మార్గం లేకపోవడంతో సుమారు 30 మంది పిల్లలు గ్రామంలో చదువుకు దూరమయ్యారు. చినఖేర్జిల నుంచి ఊటకోసు మీదుగా తినుకు, బద్దిడి గ్రామాలకు రోడ్డు సౌకర్యం కల్పించాలని సర్పంచి చోడి పెంటయ్య ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. 
- న్యూస్‌టుడే, కొమరాడ

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు