logo

మూడేళ్ల నిర్లక్ష్యం..రోగులకు శాపం

గుమ్మలక్ష్మీపురం పరిసర ప్రాంతాలకు కేంద్రంగా ఉన్న భద్రగిరి సామాజిక ఆసుపత్రిలో సరైన వసతులు లేక రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు

Published : 03 Jul 2024 05:18 IST

గుమ్మలక్ష్మీపురం పరిసర ప్రాంతాలకు కేంద్రంగా ఉన్న భద్రగిరి సామాజిక ఆసుపత్రిలో సరైన వసతులు లేక రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సీహెచ్‌సీ స్థాయి 30 నుంచి 50 పడకలకు పెరిగినా సమస్యలు తీరడం లేదు. మూడేళ్ల క్రితం రూ.9 కోట్లతో వైకాపా హయాంలో నూతన భవన నిర్మాణ పనులు ప్రారంభించారు. కానీ ఇప్పటికీ పూర్తి చేయకపోవడంతో 30 పడకలతోనే కొనసాగుతోంది. ఇక్కడ రోజుకు సుమారు 200 వరకు ఓపీ నమోదవుతుండగా.. 50 నుంచి 60 మంది ఇన్‌పేషెంట్లుగా చేరుతున్నారు. దీంతో పడకలు సరిపోకపోవడంతో ముగ్గురు, నలుగురు చొప్పున ఒకే మంచంపై పడుకొని చికిత్స పొందాల్సిన పరిస్థితి నెలకొంది. ఇటీవల వర్షాలు కురుస్తుండటంతో విద్యార్థినులు సైతం జ్వరాల బారిన పడి ఆసుపత్రుల్లో చేరుతున్నారు. ఇప్పటికే ఆసుపత్రిలో సమస్యలను గుర్తించామని, నూతన భవనం పనులు పూర్తి చేసి సౌకర్యాలు మెరుగుపరుస్తామని ఎమ్మెల్యే జగదీశ్వరి తెలిపారు. 

న్యూస్‌టుడే, గుమ్మలక్ష్మీపురం   

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని