logo

గిరిజన ద్రోహి జగన్‌

గిరిజన హక్కులు, రిజర్వేషన్లు కాలరాసి జగన్‌మోహనరెడ్డి గిరిజన ద్రోహిగా మిగిలారని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి విమర్శించారు.

Published : 03 Jul 2024 05:17 IST

ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలికలను పరామర్శిస్తున్న మంత్రి సంధ్యారాణి 

సాలూరు, న్యూస్‌టుడే: గిరిజన హక్కులు, రిజర్వేషన్లు కాలరాసి జగన్‌మోహనరెడ్డి గిరిజన ద్రోహిగా మిగిలారని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి విమర్శించారు. మంగళవారం ఆమె నివాసంలో విలేకర్లతో మాట్లాడుతూ పార్లమెంట్‌లో అరకు పార్లమెంట్‌ సభ్యురాలు తనూజరాణి చేసిన వ్యాఖ్యలను ఖండించారు. ఏజెన్సీలో గిరిజనులకు శతశాతం ఉద్యోగావకాశాలు కల్పించాలని జీవో-3 తీసుకొచ్చింది దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌ అన్నారు. ఈ జీవోను సుప్రీంకోర్టు నాలుగేళ్ల కిందట కొట్టేసినా వైకాపా ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. తెదేపా ప్రభుత్వం గిరిజనులకు 16 సంక్షేమ పథకాలను అమలు చేయగా వీటిని నిలిపేసి గిరిజనులకు ద్రోహం చేశారన్నారు. గిరిజనులకు అన్యాయం జరిగిందంటే అది వైకాపా పాలనలోనే.. ఇవేవీ తెలుసుకోకుండా ఎంపీ మాట్లాడారన్నారు.

విద్యార్థినుల ఆరోగ్యం ఆరా

సాలూరు, న్యూస్‌టుడే: గిరిజన ఆశ్రమ పాఠశాలల విద్యార్థుల ఆరోగ్యంపై గిరిజన శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి ఆరా తీశారు. జ్వరాలతో బాధపడుతూ పట్టణ ప్రభుత్వాసుపత్రిలో కురుకుట్టి, కొత్తవలస, మామిడిపల్లి ఆశ్రమ పాఠశాలల విద్యార్థినులు చికిత్స పొందుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న ఆమె మంగళవారం ఆసుపత్రికి వెళ్లి వారిని పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితిని సూపరింటెండెంట్‌ రత్నకుమారిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం విలేకర్లతో మాట్లాడుతూ ఆశ్రమాల్లో విద్యార్థుల ఆరోగ్యం పరిశీలించేందుకు ఏఎన్‌ఎంల నియామక ప్రక్రియ చేపట్టేందుకు జీవో జారీ చేశామన్నారు. హాస్టల్స్, ఆశ్రమాలు, గురుకులాల్లో వైద్య శిబిరాలు నిర్వహించాలని ఆదేశించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని