logo

విద్యుత్తు బిల్లులు ఇలా కట్టేయొచ్చు

ఆర్‌బీఐ మార్గదర్శకాల ప్రకారం దేశ వ్యాప్తంగా ఇప్పటికే ఫోన్‌పే, గూగుల్‌పే తదితర యాప్‌లలో విద్యుత్తు బిల్లుల చెల్లింపులు నిలిచిపోయాయి

Published : 03 Jul 2024 04:30 IST

ఏపీఈపీడీసీఎల్‌ అధికారులు విడుదల చేసిన ప్రకటన 

విజయనగరం పట్టణం, న్యూస్‌టుడే: ఆర్‌బీఐ మార్గదర్శకాల ప్రకారం దేశ వ్యాప్తంగా ఇప్పటికే ఫోన్‌పే, గూగుల్‌పే తదితర యాప్‌లలో విద్యుత్తు బిల్లుల చెల్లింపులు నిలిచిపోయాయి. ఈమేరకు వినియోగదారులకు ఇబ్బంది లేకుండా ఆంధ్రప్రదేశ్‌ తూర్పు ప్రాంత విద్యుత్తు పంపిణీ సంస్థ(ఏపీఈపీడీసీఎల్‌) తక్షణ చర్యలు చేపట్టింది. ఈపీడీసీఎల్‌ వెబ్‌సైట్‌తో పాటు మొబైల్‌ యాప్‌ ద్వారా చెల్లించే వెసులుబాటు కల్పించింది. ఆండ్రాయిడ్‌ చరవాణి ద్వారా eastern power యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.www.apeasternpower.com వెబ్‌సైట్‌నూ వినియోగించవచ్చు. ఈ సమయంలో ఫోన్‌ పే, గూగుల్‌ పే, పేటీఎం, ఇతర యూపీఐ యాప్‌లతో పాటు డెబిట్, క్రెడిట్‌ కార్డులు, వాలెట్‌లు, క్యాష్‌ కార్డులు, నెట్‌ బ్యాంకింగ్‌ అనుసంధానం ద్వారా పేమెంట్‌ ఐచ్ఛికను ఎంపిక చేసుకోవచ్చని సంస్థ పేర్కొంది.

ఇబ్బందులు లేకుండా చర్యలు..

‘ఉమ్మడి జిల్లాలో 9.50 లక్షల మంది విద్యుత్తు వినియోగదారులున్నారు. బిల్లుల చెల్లింపుల్లో ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నాం. ఈమేరకు ఏపీఈపీడీసీఎల్‌ తగిన సౌకర్యాలు కల్పించింది. ఎలాంటి ఆందోళన అవసరం లేదు’ అని సంస్థ పర్యవేక్షణ ఇంజినీరు ఎం.లక్ష్మణరావు ‘న్యూస్‌టుడే’కు తెలిపారు.

వినియోగదారులకు అవకాశాలిలా..

  • ఈపీడీసీఎల్‌ మొబైల్‌ యాప్‌
  • ఈపీడీసీఎల్‌ అధికారిక వెబ్‌సైట్‌
  • పార్వతీపురం, బొబ్బిలి, రాజాం,  విజయనగరంలోని ఈఆర్వో కేంద్రాలు
  • ఏటీపీ మిషన్‌ కేంద్రాలు
  • గ్రామాల్లో రూ.10 వేల బిల్లు వరకు రెవెన్యూ క్యాషియర్స్‌ ద్వారా చెల్లింపులు చేయొచ్చు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని