logo

అనాస రైతుల ఆందోళన

మన్యంలో విస్తారంగా పండే అనాస (పైనాపిల్‌) ధరలు రోజు రోజుకీ పతనం అవుతున్నాయి. సీతంపేట వారపు సంతకు ఆదివారం భారీగా పంట తరలి వచ్చినా అనుకున్న మేర గిట్టుబాటు కావడం లేదు.

Published : 01 Jul 2024 05:42 IST

సీతంపేటలో అమ్మకాలు  

సీతంపేట, న్యూస్‌టుడే: మన్యంలో విస్తారంగా పండే అనాస (పైనాపిల్‌) ధరలు రోజు రోజుకీ పతనం అవుతున్నాయి. సీతంపేట వారపు సంతకు ఆదివారం భారీగా పంట తరలి వచ్చినా అనుకున్న మేర గిట్టుబాటు కావడం లేదు. కొన్ని రోజులుగా వర్షాలు కురుస్తుండటం, పంటంతా ఒకేసారి పక్వానికి రావడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. సంతకు వచ్చే వివిధ ప్రాంతాల వ్యాపారులు తక్కువ ధరకే కొనుగోలు చేసి తరలించుకుపోతున్నారు. 
గత వారం ఒక్కో కాయ సైజు బట్టి రూ.10 నుంచి రూ.18 వరకు పలకగా, ప్రస్తుతం రూ.5 నుంచి రూ.13 లోపే కొంటున్నారని గిరిజనులు వాపోతున్నారు. నిల్వ ఉంచే వీలు లేకపోవడం, పంటంతా ఒకేసారి తీసుకురావడంతో చేసేది లేక వ్యాపారులు అడిగిన ధరకు ఇస్తున్నట్లు చెబుతున్నారు. ఇక్కడ పండే పైనాపిల్‌తో జ్యూస్, ఆహార పదార్థాలు తయారు చేసేలా ఫుడ్‌ ప్రొసెసింగ్‌ యూనిట్లు నెలకొల్పితే మేలు జరుగుతుందని ఆశిస్తున్నారు. సీతంపేటలో రూ.5 కోట్లతో అనాస ప్రొసెసింగ్‌ యూనిట్‌ ఏర్పాటుకు ప్రతిపాదనలు ఉన్నా గత ప్రభుత్వం పట్టించుకోలేదు. దీనిపై కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టాలని గిరిజనులు కోరుతున్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని