logo

ఇక రైతు సేవా కేంద్రాలు

రైతు భరోసా కేంద్రాలను ఇక నుంచి రైతు సేవా కేంద్రాలుగా మారుస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వ్యవసాయశాఖకు ఆదేశాలు అందాయి.

Published : 01 Jul 2024 05:17 IST

    సీహెచ్‌ బొడ్డవలసలో రైతు భరోసా కేంద్రం 

బొబ్బిలి గ్రామీణం, న్యూస్‌టుడే: రైతు భరోసా కేంద్రాలను ఇక నుంచి రైతు సేవా కేంద్రాలుగా మారుస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వ్యవసాయశాఖకు ఆదేశాలు అందాయి. వైకాపా ప్రభుత్వం సచివాలయ వ్యవస్థను ఏర్పాటుచేసి ఆ పరిధిలో ఆర్బీకేలను ఏర్పాటుచేసింది. రైతులకు విత్తనాలు, ఎరువులు వీటి ద్వారానే అందిస్తున్నారు. పంటల సాగుపై రైతులకు శిక్షణ ఇచ్చేందుకు శాస్త్రవేత్తలతో సమావేశాలు నిర్వహించాలని, బ్యాంకుల ద్వారా రుణాలు ఇచ్చే ఏర్పాటు చేస్తామని చెప్పినా అమలు కాలేదు. ఒక్కో కేంద్రం నిర్మాణానికి రూ.23 లక్షల చొప్పున ఉపాధి నిధులు వెచ్చించారు. వ్యవసాయ, ఉద్యాన సహాయకులను ప్రభుత్వం నియమించింది. వారే రైతులకు అందుబాటులో ఉండి సేవలు అందిస్తున్నారు. జిల్లాలో 510 ఆర్బీకేలున్నాయి. కొన్నిచోట్ల భవనాలు మంజూరైనా బిల్లులు చెల్లించకపోవడంతో సగంలో పనులు నిలిచిపోయాయి. రైతులకు సమాచారం అందించే రైతు భరోసా మేగజైన్‌ను ‘పాడిపంటలు’గా పేరు మార్చారు. ఆర్బీకే ఛానల్‌కు పాడిపంటలు ఛానల్‌గా మార్చారు. రైతు సేవా కేంద్రాలుగా మార్చుతూ ఆదేశాలొచ్చాయని బొబ్బిలి ఏడీఏ మజ్జి శ్యామ్‌సుందర్‌ తెలిపారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని