logo

శిథిలం.. భయం భయం

సాలూరు పురపాలిక పరిధిలోని పలు ప్రభుత్వ భవనాలు శిథిలావస్థకు చేరాయి. దీంతో ఉద్యోగులు, సిబ్బంది భయాందోళన నడుమ విధులు నిర్వహిస్తున్నారు.

Published : 01 Jul 2024 05:15 IST

శిథిలావస్థకు చేరిన ఎమ్మార్సీ కార్యాలయం

సాలూరు పురపాలిక పరిధిలోని పలు ప్రభుత్వ భవనాలు శిథిలావస్థకు చేరాయి. దీంతో ఉద్యోగులు, సిబ్బంది భయాందోళన నడుమ విధులు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే విద్యాశాఖాధికారి కార్యాలయం, రిసోర్స్‌ సెంటర్‌ దెబ్బతినడంతో మూసేశారు. ఈక్రమంలో ఎంఈవోలతో పాటు ఇతర సిబ్బంది కొన్ని నెలలుగా సమీపంలో ఉన్న భవిత కేంద్రంలో ఉంటున్నారు. ఆ భవనానిదీ అదే పరిస్థితి. పునాదుల నుంచి గోడలు, గచ్చులన్నీ బీటలు వారాయి. కొన్నిచోట్ల పిల్లర్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి. లోపలి గోడలు కూలేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఈ భవనంలోనే ప్రత్యేక అవసరాలుగల చిన్నారులకు విద్య, వైద్య సేవలు అందిస్తున్నారు. దీంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనని అంతా ఆందోళన చెందుతున్నారు. ఈ పరిస్థితిపై ఇన్‌ఛార్జి డిప్యూటీ డీఈవో రాజ్‌కుమార్‌ను ‘న్యూస్‌టుడే’ వివరణ కోరగా.. భవన నిర్మాణాలను ప్రతిపాదనలు చేశామని, నిధులు మంజూరైతే పనులు ప్రారంభిస్తామన్నారు.

న్యూస్‌టుడే, సాలూరు

భవిత కేంద్రంలో పునాది నుంచి పైకప్పు వరకు బీటలు వారిన గచ్చులు, గోడ

 


దెబ్బతిన్న గచ్చు 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని