logo

కరిరాజుల హల్‌చల్‌

మండలంలో సంచరిస్తున్న ఆరు ఏనుగుల గుంపు బీభత్సం సృష్టిస్తోంది. పరజపాడు, పెదకుదమ, చినకుదమ, గౌరీపురం సమీపంలో ఏనుగులు తిరుగుతూ ప్రజల ఆస్తులకు నష్టం కలిగిస్తున్నాయి.

Published : 01 Jul 2024 05:08 IST

పరజపాడులో ధ్వంసమైన గోడ 

జియ్యమ్మవలస, న్యూస్‌టుడే: మండలంలో సంచరిస్తున్న ఆరు ఏనుగుల గుంపు బీభత్సం సృష్టిస్తోంది. పరజపాడు, పెదకుదమ, చినకుదమ, గౌరీపురం సమీపంలో ఏనుగులు తిరుగుతూ ప్రజల ఆస్తులకు నష్టం కలిగిస్తున్నాయి. శనివారం అర్ధరాత్రి పరజపాడులో తంగుడు సింహాచలానికి చెందిన ధాన్యం భద్రపరిచే గది గోడను కూల్చివేసి బస్తాలు పాడు చేశాయి. పరజపాడు, దత్తివలస, కుదమ గ్రామాల్లో అరటి చెట్లను విరిచేసినట్లు రైతులు వాపోతున్నారు. వాటిని దూరంగా తరలించాలని కోరుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని