logo

రైల్వే గేట్లు తొలగించాలని వినతి

కొమరాడ మండలంలోని అర్తాం నుంచి కోటిపాం వరకు 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న మూడు రైల్వేగేట్ల సమస్యను పరిష్కరించాలని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు శుక్రవారం దిల్లీలో ఆ శాఖ ఓఎస్డీ వేదప్రకాశ్‌ను కలిసి వినతిపత్రం అందించారు.

Published : 29 Jun 2024 03:33 IST

ఓఎస్‌డీకి వినతిపత్రం ఇస్తున్న ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు  

కొమరాడ, న్యూస్‌టుడే: కొమరాడ మండలంలోని అర్తాం నుంచి కోటిపాం వరకు 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న మూడు రైల్వేగేట్ల సమస్యను పరిష్కరించాలని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు శుక్రవారం దిల్లీలో ఆ శాఖ ఓఎస్డీ వేదప్రకాశ్‌ను కలిసి వినతిపత్రం అందించారు. విశాఖ నుంచి పార్వతీపురం మీదుగా ఒడిశా, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌కు వెళ్లే భారీ వాహనాలు, చోదకులు గేట్ల వద్ద ఆగిపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. అంబులెన్స్‌లు ఆగిపోవడంతో ఒక్కోసారి రోగుల ప్రాణాలు పోతున్నాయని వివరించారు. ఒక గేటు వద్ద పైవంతెన నిర్మించి, మిగిలిన రెండు గేట్లు తొలగించాలని కోరారు.
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని