logo

రహదారులకు మోక్షం

గత అయిదేళ్లలో నిర్వహణకు నోచుకోకపోవడంతో అధ్వానంగా మారిన రోడ్లకు ఎట్టకేలకు మోక్షం కలగనుంది.

Published : 29 Jun 2024 03:32 IST

రూ.35 లక్షలతో ప్రతిపాదనలు పంపించిన సీతానగరం రోడ్డు 

కొమరాడ, సీతానగరం, న్యూస్‌టుడే: గత అయిదేళ్లలో నిర్వహణకు నోచుకోకపోవడంతో అధ్వానంగా మారిన రోడ్లకు ఎట్టకేలకు మోక్షం కలగనుంది. పార్వతీపురం నుంచి కూనేరు వెళ్లే ప్రధాన రహదారిలో 26 కి.మీ. మేర కొమరాడ, చోళపదం, కూనేరు, పార్వతీపురం సమీపంలో పెద్ద గోతులతో నరకాన్ని తలపిస్తుంది. దీనిపై కురుపాం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి గిరిజన శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణికి వినతిపత్రం అందజేశారు. దీనిపై మంత్రి స్పందించి ఆదేశాలు జారీ చేయడంతో ర.భ.శాఖ ఈఈ వేణుగోపాలరావు, డీఈ అప్పాజీ చర్యలు చేపట్టారు. పార్వతీపురం నుంచి కూనేరు వరకు గుంతలను పరిశీలించి కొలతలు వేశారు. దీనిపై నివేదికను ఉన్నతాధికారులకు పంపిస్తామని తెలిపారు. సీతానగరం మీదుగా అజ్జాడ వెళ్లే రోడ్డు వర్షాల సమయంలో చెరువును తలపించడంతో ఎమ్మెల్యే విజయచంద్రకు స్థానికులు సమస్య చెప్పారు. ఆయన ర.భ.శాఖ ఉన్నతాధికారులతో మాట్లాడి త్వరితగతిన మరమ్మతులు చేయాలని ఆదేశించారు. ఈ నేపథ్యంలో రూ.35 లక్షల అంచనాతో ప్రతిపాదనలు పంపించినట్లు ర.భ.శాఖ ఏఈ రామ్మోహనరావు ‘న్యూస్‌టుడే’కు తెలిపారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని