logo

ప్రయోగాల వేదికపై ప్రశంసలు

జాతీయస్థాయి భౌతికశాస్త్ర కార్యశాల వేదికపై జిల్లాకు చెందిన భౌతికశాస్త్ర అధ్యాపకుడు జోగా చంద్రశేఖర్‌ ప్రశంసలు దక్కించు కున్నారు.

Published : 29 Jun 2024 03:05 IST

తరంగాల ప్రయోగాన్ని వివరిస్తున్న చంద్రశేఖర్‌

విజయనగరం విద్యావిభాగం, న్యూస్‌టుడే: జాతీయస్థాయి భౌతికశాస్త్ర కార్యశాల వేదికపై జిల్లాకు చెందిన భౌతికశాస్త్ర అధ్యాపకుడు జోగా చంద్రశేఖర్‌ ప్రశంసలు దక్కించు కున్నారు. భౌతికశాస్త్రంలో ప్రాథమిక, సంక్లిష్ట అంశాలను ఇంట్లో ఉండే వస్తువులతో విద్యార్థులకు బోధించే విధానాన్ని ప్రయోగపూర్వకంగా వివరించారు. ఇండియన్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఫిజిక్స్‌ టీచర్స్, నేషనల్‌ అన్వేషిక నెట్‌వర్క్‌ ఇండియా ఆధ్వర్యంలో ఈనెల 24 నుంచి 26 వరకు హిమాచల్‌ప్రదేశ్‌లో జరిగిన  సదస్సు ఆయన పాల్గొన్నారు. రాష్ట్రం నుంచి చంద్రశేఖర్‌ ఒక్కరికే అవకాశం దక్కింది. ఆయన ప్రస్తుతం రాజాం డిగ్రీ కళాశాలలో అధ్యాపకుడిగా పనిచేస్తున్నారు. సమాంతర విద్యుత్తు ప్రవాహం, పీడనం, ప్రాథమిక, గౌణ తరంగాలు, తరంగచలనం తదితర ప్రయోగాలతో ప్రముఖులను ఆలోచింపజేశారు. జాతీయ అన్వేషిక నెట్‌వర్క్‌ సమన్వయకర్త, పద్మశ్రీ హెచ్‌.సి.వర్మ, భారత భౌతికశాస్త్ర ఉపాధ్యాయుల సంఘం జాతీయ అధ్యక్షుడు పి.కె.అహ్లువాలియా, ఎన్‌ఐటీ సంచాలకుడు సూర్యవంశీల చేతులమీదుగా ప్రశంసాపత్రాన్ని అందుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని