logo

అక్రమ నిర్మాణాలపై చర్యలు తప్పవు

వైకాపా హయాంలో జిల్లా కార్యాలయాల పేరుతో ప్రభుత్వ భూముల్లో అక్రమ నిర్మాణాలు చేపట్టారని, ఇదే ఆ పార్టీ విధానమని విజయనగరం ఎమ్మెల్యే అదితి విజయలక్ష్మి గజపతిరాజు అన్నారు.

Published : 28 Jun 2024 05:42 IST

వైకాపా కార్యాలయాన్ని పరిశీలిస్తున్న ఎమ్మెల్యే అదితి గజపతిరాజు, తెదేపా, జనసేన, భాజపా నాయకులు 

విజయనగరం పట్టణం, న్యూస్‌టుడే: వైకాపా హయాంలో జిల్లా కార్యాలయాల పేరుతో ప్రభుత్వ భూముల్లో అక్రమ నిర్మాణాలు చేపట్టారని, ఇదే ఆ పార్టీ విధానమని విజయనగరం ఎమ్మెల్యే అదితి విజయలక్ష్మి గజపతిరాజు అన్నారు. రింగురోడ్డు సమీపంలోని మహరాజుపేట ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న కార్యాలయాన్ని గురువారం కూటమి నాయకులతో కలిసి ఆమె పరిశీలించారు. ఇలాంటి అక్రమ కట్టడాలపై చర్యలు తప్పవని పేర్కొన్నారు. వైకాపా అంటేనే ఆక్రమణలు, అక్రమాలు, దందాలు, దోపిడీలని మండిపడ్డారు. గతంలో తెదేపా ప్రభుత్వ హయాంలో జరిగిన శంకుస్థాపనలకు మళ్లీ కొబ్బరి కాయలు కొట్టారు తప్ప గత అయిదేళ్లలో ఎక్కడా అభివృద్ధి పనులు లేవన్నారు. నాయకులు ఐవీపీ.రాజు, ప్రసాదుల వరప్రసాద్, ఆల్తి బంగారుబాబు, కర్రోతు నరసింగరావు, పిళ్లా విజయ్‌కుమార్, అవనాపు విజయ్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని