logo

ఆ ఫోన్‌కాల్స్‌పై అప్రమత్తత అవసరం

కొన్ని కొరియర్‌ సర్వీసుల పేర్లతో వచ్చే ఫోన్‌ కాల్స్‌ విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ దీపిక ఎం.పాటిల్‌ కోరారు.

Published : 28 Jun 2024 05:34 IST

 పోలీసు శాఖ విడుదల చేసిన ప్రకటన 

విజయనగరం నేరవార్తా విభాగం, న్యూస్‌టుడే: కొన్ని కొరియర్‌ సర్వీసుల పేర్లతో వచ్చే ఫోన్‌ కాల్స్‌ విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ దీపిక ఎం.పాటిల్‌ కోరారు. తెలియని, అనవసర లింకులను తెరవొద్దని, నకిలీ యాప్‌లను డౌన్‌లోడ్‌ చేయొద్దని విన్నవించారు. చాలామంది మోసాలకు గురవుతున్నారని పేర్కొన్నారు. ఈ మేరకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతూ గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు. వివిధ సంస్థలు, ప్రఖ్యాతి గాంచిన వ్యక్తులు, ప్రభుత్వ విభాగాల పేరుతో చరణాలకు సంక్షిప్త సమాచారాలు పంపిస్తున్నారని చెప్పారు. చిరునామా, ఆధార్‌ సంఖ్య, బ్యాంకు ఖాతాల వివరాలను ఎట్టి పరిస్థితుల్లోనూ చెప్పొద్దన్నారు. ఓటీపీలు, పాస్‌వర్డ్‌ల విషయంలో గోప్యత పాటించాలని, ఎవరైనా నగదు పోగొట్టుకున్నా.. గుర్తుతెలియని వారు మోసం చేస్తున్నారని భావించినా వెంటనే సమీపంలోని పోలీస్‌స్టేషన్‌ను గానీ, సైబర్‌ క్రైం స్టేషన్‌ను గానీ సంప్రదించాలని, అత్యవసరమైతే 1930కు, నేషనల్‌ సైబర్‌ క్రైం పోర్టల్‌లో ఫిర్యాదు చేయాలని సూచించారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు