logo

ఎడ్‌సెట్‌లో మెరుపులు

ఎడ్‌సెట్‌-24 ఫలితాల్లో ఉమ్మడి జిల్లా విద్యార్థులు సత్తా చాటారు. జీవశాస్త్రంలో విజయనగరానికి చెందిన ఇంజమూరి వెంకటసాయి మణికంఠ రాష్ట్రంలో ప్రథమ ర్యాంకు సాధించాడు.

Published : 28 Jun 2024 05:30 IST

 మణికంఠ,  లోకేశ్వరి,  సాద్విక, పురుషోత్తంరావు 

విజయనగరం విద్యావిభాగం, న్యూస్‌టుడే: ఎడ్‌సెట్‌-24 ఫలితాల్లో ఉమ్మడి జిల్లా విద్యార్థులు సత్తా చాటారు. జీవశాస్త్రంలో విజయనగరానికి చెందిన ఇంజమూరి వెంకటసాయి మణికంఠ రాష్ట్రంలో ప్రథమ ర్యాంకు సాధించాడు. గణితం, భౌతికశాస్త్రం, సాంఘికశాస్త్రం విభాగాల్లో విద్యార్థులు మంచి ర్యాంకులు కైవసం చేసుకున్నారు. గణితంలో పార్వతీపురం మన్యం జిల్లా గరుగుబిల్లి మండలం సంతోషపురానికి చెందిన సిరికి వెంకటసాయి అయిదో ర్యాంకు, భౌతికశాస్త్రంలో గరుగుబిల్లి మండలం పెద్దూరు గ్రామానికి చెందిన ఈశ్వరరావుకు నాలుగో ర్యాంకు, గంట్యాడ మండలం నరవ గ్రామానికి చెందిన జి.నారాయణకు అయిదో ర్యాంకు, విజయనగరానికి చెందిన సంతోష్‌కుమార్‌కు పదో ర్యాంకు దక్కాయి.

బయాలజీలో లోకేశ్వరికి ఐదో ర్యాంకు 

గజపతినగరం: జంతుశాస్త్ర విభాగంలో గజపతినగరం మండలం జిన్నాం గ్రామానికి చెందిన మంత్రి లోకేశ్వరికి 84 మార్కులతో 5వ ర్యాంకు లభించింది. ఈమె తండ్రి గోవిందరావు, తల్లి లక్ష్మి. వ్యవసాయ కుటుంబం. ఉపాధ్యాయురాలిగా స్థిరపడి, విద్యార్థులకు ఉత్తమ సేవలు అందించాలన్నదే తన లక్ష్యమని ఈ విద్యార్థిని చెబుతోంది.

మరడాం విద్యార్థి సత్తా..

దత్తిరాజేరు: మరడాం గ్రామానికి చెందిన ముగడ పురుషోత్తంరావు సాంఘిక శాస్త్ర విభాగంలో 87/100 మార్కులతో పదో ర్యాంకు సాధించాడు. విశాఖలోని ఆంధ్ర విశ్వవిద్యాలయంలో డిగ్రీ హెచ్‌ఈపీ చదివాడు. ప్రస్తుతం ఎస్‌.కోటలోని ఓ ప్రైవేటు పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ పోటీ పరీక్షలకు సాధన చేస్తున్నాడు. తండ్రి వ్యవసాయ కూలీ.

సాఫ్ట్‌వేర్‌ రంగంలో స్థిరపడతా..

కొత్తవలస: పట్టణంలోని డ్రైవర్ల కాలనీకి చెందిన నౌడు సాద్విక కంప్యూటర్‌ సైన్స్‌లో 74 మార్కులతో ఆరో ర్యాంకు పొందింది. ఏయూలో ఎమ్మెస్సీ కంప్యూటర్‌ సైన్స్‌ చేసి సాఫ్ట్‌వేర్‌లో ఉన్నత స్థానానికి చేరుకునేందుకు కష్టపడతానని ఆమె చెబుతోంది. తండ్రి సింహాద్రప్పడు లారీ చోదకుడు. తల్లి ఆశాజ్యోతి గృహిణి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని