logo

‘పథకాల పేరుతో జగన్‌ మోసం చేశారు’

అక్కచెల్లెమ్మలను ఆదుకుంటామని చెప్పి, మాజీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి చేయూత పథకం లబ్ధిదారులను మోసం చేశారని పలువురు మహిళలు వాపోయారు.

Published : 28 Jun 2024 05:26 IST

వినతిపత్రాలు చూపుతున్న లబ్ధిదారులు 

మయూరి కూడలి, న్యూస్‌టుడే: అక్కచెల్లెమ్మలను ఆదుకుంటామని చెప్పి, మాజీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి చేయూత పథకం లబ్ధిదారులను మోసం చేశారని పలువురు మహిళలు వాపోయారు. గురువారం విజయనగరంలోని డీఆర్డీఏ కార్యాలయం, పలు వార్డు సచివాలయాల వద్ద ఐద్వా, సిటూ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా ఐద్వా పట్టణ కార్యదర్శి వి.లక్ష్మి, సిటూ నగర అధ్యక్షుడు ఎ.జగన్‌మోహన్‌రెడ్డి మాట్లాడారు. చేయూత 4వ విడత కింద ఒక్కొక్కరికీ రూ.18,750 ఇవ్వాలని, రెండు జిల్లాల్లో 2.42 లక్షల మందికి రూ.141.16 కోట్ల మేర అందజేయాల్సి ఉందన్నారు. ఇప్పటి వరకు ఎంత మందికి నగదు జమైందో కూడా అధికారులు చెప్పలేకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. వెంటనే ఆ సొమ్ము వచ్చేలా చూడాలని కోరారు. అనంతరం అధికారులకు వినతిపత్రాలు అందజేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని