logo

26.90 మి.మీ. సరాసరి వర్షపాతం నమోదు

అల్పపీడన ద్రోణి ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఖరీఫ్‌ సాగులో మరో ముందడుగు పడింది.

Published : 28 Jun 2024 05:24 IST

విజయనగరం వ్యవసాయ విభాగం, న్యూస్‌టుడే: అల్పపీడన ద్రోణి ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఖరీఫ్‌ సాగులో మరో ముందడుగు పడింది. బుధవారం ఉదయం నుంచి గురువారం ఉదయం వరకు సరాసరి వర్షపాతం 26.90 మిల్లీమీటర్లుగా నమోదైంది. అత్యధికంగా బాడంగి మండలంలో 149.40 మి.మీ.., వేపాడ- 51.8, రాజాం- 48.6, సంతకవిటి- 41.2, మెరకముడిదాం- 39.2, బొబ్బిలి- 36.4, విజయనగరం- 35.2, తెర్లాం- 33.2, రామభద్రపురం- 29.6, భోగాపురం- 28.2, ఎల్‌.కోట- 26.6, నెల్లిమర్ల- 22.4, డెంకాడ- 21.6, పూసపాటిరేగ- 20.8, దత్తిరాజేరు- 17.8, జామి- 17.4, వంగర- 17.4, గజపతినగరం- 14.8, రేగిడి- 14.8, మెంటాడ- 13, గంట్యాడ మండలంలో 12.8 మి.మీ వర్షం కురిసింది. మిగిలిన ప్రాంతాల్లో 2 నుంచి 10 మి.మీ మధ్య నమోదైంది. ఈ వర్షాలు సాగుకు ఎంతో అనుకూలమని వ్యవసాయాధికారులు చెబుతున్నారు. చెరువులు నిండుతుండడంతో వరి పంటకు నీటి సమస్య ఉండదని పేర్కొంటున్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని