logo

చాలని భోజనం.. ఆకలితో అలమటించిన విద్యార్థులు

బొబ్బిలి మండలంలోని పిరిడి ఉన్నత పాఠశాలలో చాలీచాలని భోజనంతో విద్యార్థులు ఆకలితో అలమటిస్తున్నారు.

Published : 26 Jun 2024 04:04 IST

 ఖాళీ కంచాలతో ఎదురుచూస్తున్న విద్యార్థులు

బొబ్బిలి గ్రామీణం, న్యూస్‌టుడే: బొబ్బిలి మండలంలోని పిరిడి ఉన్నత పాఠశాలలో చాలీచాలని భోజనంతో విద్యార్థులు ఆకలితో అలమటిస్తున్నారు. ఇక్కడ కొద్దిరోజుల నుంచి భోజనం సరిపడా పెట్టడం లేదని కొంతమంది విద్యార్థులు తల్లిదండ్రులకు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం కొంతమంది తల్లిదండ్రులు వచ్చి భోజనం వడ్డింపును చూశారు. 250 మంది హాజరు కాగా.. సుమారు 40 మందికి పులిహోర, 60 మందికి గుడ్లు చాలకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధానోపాధ్యాయుడు మధుసూదనరావుకు ఫిర్యాదు చేశారు. సాయంత్రం ఇళ్లకు వచ్చి తింటున్నారని, ఇదేం తీరని ప్రశ్నించారు. మెనూ ప్రకారం పులిహోర, చట్నీ, గుడ్డు అందించాల్సి ఉండగా ఉపాధ్యాయులు అవసరమైన బియ్యం, 250 గుడ్లు నిర్వాహకులకు అందించారని ఆయన చెప్పారు. దొండకాయలు, వేరుసెనగ నిర్వాహకులే కొనుగోలు చేసుకోవాలని పేర్కొన్నారు. ఈ విషయాన్ని సంబంధిత ఉన్నతాధికారులకు నివేదిస్తామన్నారు. మళ్లీ వండే వరకు దాదాపు గంటపాటు పిల్లలు ఎదురుచూశారు.

గుడ్లు లేకుండా పులిహోర వడ్డన 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని