logo

Politics: డెంగీ వ్యతిరేక మాసోత్సవ అవగాహన ర్యాలీ

డెంగీ వ్యాధిని సమాజం నుంచి పారదోలేందుకు ప్రతి ఒక్కరూ ఆ వ్యాధిపై అవగాహన కలిగి ఉండాలని బలిజిపేట పీహెచ్‌సీ వైద్యాధికారిణి క్రాంతి కిరణ్మయి అన్నారు.

Published : 01 Jul 2024 17:16 IST

బలిజిపేట: డెంగీ వ్యాధిని సమాజం నుంచి పారదోలేందుకు ప్రతి ఒక్కరూ ఆ వ్యాధిపై అవగాహన కలిగి ఉండాలని బలిజిపేట పీహెచ్‌సీ వైద్యాధికారిణి క్రాంతి కిరణ్మయి అన్నారు. మండలంలోని చిలకలపల్లి గ్రామంలో సోమవారం ప్రజాప్రతినిధులు, వైద్య సిబ్బందితో కలసి ఆమె అవగాహన ర్యాలీ నిర్వహించారు. అలాగే డయేరియా అదుపు కార్యక్రమాలు నిర్వహించి ప్రజలను ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దాలని ఆమె సిబ్బందికి సూచించారు. ఆరోగ్య ఉపకేంద్రంలో సర్పంచి అలజంగి సుందరరావు అధ్యక్షతన ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించి, అందరూ డ్రైడే పాటించాలని సూచించారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని