logo

రైతులకు మేలు చేసే కార్యక్రమాలు ప్రారంభిస్తాం

రైతులకు మేలు చేసే కార్యక్రమాలనే తమ ప్రభుత్వం ప్రారంభిస్తుందని ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ అన్నారు.

Published : 29 Jun 2024 12:12 IST

వీరఘట్టం: రైతులకు మేలు చేసే కార్యక్రమాలనే తమ ప్రభుత్వం ప్రారంభిస్తుందని ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ అన్నారు. శనివారం వీరఘట్టం మండలం కత్తుల కవిటి రైతు భరోసా కేంద్రంలో ఎరువుల పంపిణీ కార్యక్రమాన్ని  ప్రారంభించారు. రైతులకు అవసరమైన ఎరువులు, విత్తనాలు  అందుబాటులో ఉంటాయని చెప్పారు. రైతులకు ఏదైనా సమస్య వస్తే తీర్చేందుకు తాను ఎప్పుడూ సిద్ధంగా ఉంటానని తెలిపారు. వ్యవసాయాధికారుల సూచనలు పాటించాలని సూచించారు.  నూతన విధానాలు ఆలోచించి లాభదాయకమైన పంటలు పండించాలని తెలిపారు.  అంతకుముందు గ్రామ ముఖద్వారం వద్ద ఆయనకు స్థానిక రైతులు ఘన స్వాగతం పలికారు.  అనంతరం రైతు భరోసా కేంద్రంలో వ్యవసాయాధికారులు ఆయనను సత్కరించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ ఏ డీ రత్నకుమారి, వ్యవసాయధికారిణి సౌజన్య, తెదేపా నాయకులు  ఉదయ భాస్కర్, పొన్నాడ నాగేశ్వరరావు, చింత ఉమ, కృష్ణం నాయుడు,ఏఈవో కృష్ణకాంత్, వీ ఏ ఏ లు గుణశేఖర్, వంశీకృష్ణ పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని