logo

Parvatipuram: కాలువల ఆధునికీకరణ పనుల్లో నాణ్యత లోపం

తోటపల్లి ఎడమ కాలువ ఆధునికీకరణ పనుల్లో నాణ్యత లోపాలు కనిపిస్తున్నాయని ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ అన్నారు.

Published : 03 Jul 2024 16:06 IST

వీరఘట్టం: తోటపల్లి ఎడమ కాలువ ఆధునికీకరణ పనుల్లో నాణ్యత లోపాలు కనిపిస్తున్నాయని ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ అన్నారు. స్థానిక మండల పరిషత్తు కార్యాలయంలో బుధవారం అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ పనులు అవినీతిపరుల జేబులు నింపుకోవడానికి ఉపయోగపడ్డాయని చెప్పారు. బ్రాంచి, పిల్ల కాలువలు, అప్టెక్ ఛానల్లో పూడికలు పేరుకుపోయాయని తెలిపారు. ఉపాధిహామీ పథకంలో ఈ పనులు చేయించాలని ఏపీవో సత్యం నాయుడు, జలవనరుల శాఖ ఏఈ రాజేష్‌ను ఆదేశించారు. జగనన్న కాలనీ స్థలాల విక్రయాల్లో అవినీతి జరిగిందన్నారు. ఇందుకు సంబంధించిన వివరాలు అందజేయాలని తహసీల్దార్ జయప్రకాశ్‌ను కోరారు. వివరాలు అందుబాటులో లేవని తహసీల్దార్ చెప్పడంతో ఎమ్మెల్యే ఆశ్చర్యనికి గురయ్యారు. దీనిపై సమగ్ర విచారణ జరిపిస్తామన్నారు. పాలకొండ మార్కెట్ కమిటీ మాజీ అధ్యక్షులు పొదిలాపు కృష్ణమూర్తి నాయుడు, మండల తెదేపా అధ్యక్షుడు ఉదయాన ఉదయ భాస్కర్, నాయకులు అధికారులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని