logo

Parvatipuram: డయేరియా నియంత్రణపై అవగాహన

డయేరియా వ్యాధి నియంత్రణపై మండలంలోని పెదపెంకి గ్రామ ఉన్నత పాఠశాల, ఆ గ్రామ హెల్త్‌ క్లినిక్‌లో బలిజిపేట ప్రభుత్వ వైద్యాధికారిణి క్రాంతి కిరణ్మయి బుధవారం అవగాహన కల్పించారు.

Published : 03 Jul 2024 16:58 IST

బలిజిపేట: డయేరియా వ్యాధి నియంత్రణపై మండలంలోని పెదపెంకి గ్రామ ఉన్నత పాఠశాల, ఆ గ్రామ హెల్త్‌ క్లినిక్‌లో బలిజిపేట ప్రభుత్వ వైద్యాధికారిణి క్రాంతి కిరణ్మయి బుధవారం అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో భాగంగా వైద్యసిబ్బంది, ఆశవర్కర్లు ఇంటింటికీ వెళ్లి ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లను, జింక్‌ మాత్రలను పంపిణీ చేయాలని ఆమె ఆదేశించారు. అందరూ వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని, కాచి చల్లార్చిన నీటిని తాగాలని, డయేరియా లక్షణాలు సంక్రమిస్తే జింక్‌మాత్రలను 14 రోజులపాటు వేసుకోవాలని ఆమె విద్యార్థులకు సూచించారు. అనంతరం డయేరియా నియంత్రణపై ప్రభుత్వం ముద్రించిన ప్లకార్డులను ప్రదర్శించారు. కార్యక్రమంలో సర్పంచి పాపారావు, ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు భాస్కరరావు, వైద్య సిబ్బంది, అంగన్‌వాడీలు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని