logo

Odisha: ఇద్దరు వేటగాళ్లు అరెస్టు

ఒడిశాలో చిలికా వన్యప్రాణి డివిజన్‌ పరిధిలోని చిలికా సరస్సులో పక్షుల్ని వేటాడిన ఇద్దరు వేటగాళ్లను అటవీ శాఖ అధికారులు అరెస్టు చేశారు.

Published : 03 Jul 2024 19:50 IST

బ్రహ్మపుర నగరం: ఒడిశాలో చిలికా వన్యప్రాణి డివిజన్‌ పరిధిలోని చిలికా సరస్సులో పక్షుల్ని వేటాడిన ఇద్దరు వేటగాళ్లను అటవీ శాఖ అధికారులు అరెస్టు చేశారు. వారి నుంచి 14 మృత పక్షులు స్వాధీనం చేసుకున్నామని, వీటిలో 13 గ్రే హెడ్‌ స్వాంప్‌ హెన్‌ జాతికి చెందినవని, ఒకటి వాటర్‌ కాక్‌ జాతి పక్షి అని డివిజన్‌ అధికారి (డీఎఫ్‌ఓ) అమ్లాన్‌ నాయక్‌ బుధవారం ‘న్యూస్‌టుడే’కు చెప్పారు. అరెస్టయిన నిందితుల్ని న్యాయస్థానానికి తరలించామని, వారు పూరీ జిల్లా గడఖరడ సమీపంలోని దెయిపూర్‌కు చెందిన సంతోష్‌ పొళాయి (24), టులు పొళాయి (27) అని ఆయన పేర్కొన్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని